రుణం తీసుకోవడం అంటే కేవలం వడ్డీ, ప్రధానమైన చెల్లింపులు మాత్రమే ఉంటాయని అనుకుంటున్నారా? అసలు విషయమేమిటంటే, బ్యాంకులు కొన్ని అదనపు చార్జీలను కూడా విధిస్తాయి. ఇవి చిన్నగా కనిపించవచ్చు, కానీ చివరికి మీ EMI భారం పెరగడానికి కారణమవుతాయి.
మీరు కొత్తగా రుణం తీసుకున్నా, లేదా తీసుకోవాలని చూస్తున్నా, మీ అసలు EMI మొత్తం బ్యాంకులు చెప్పినదానికంటే కొద్దిగా ఎక్కువ ఉండవచ్చు. ఎందుకంటే రుణ మొత్తాన్ని పూర్తిగా మీ ఖాతాలో జమ చేయకముందే, బ్యాంకులు కొన్ని ఫీజులను వసూలు చేస్తాయి.
రహస్యంగా వసూలు చేసే ఛార్జీల జాబితా!
🔹 ప్రాసెసింగ్ ఫీజు ( Processing Charges): రుణ మొత్తంలో 1% నుంచి 3% వరకు బ్యాంకులు వసూలు చేస్తాయి.
Related News
🔹 ఇన్సూరెన్స్ ఛార్జీలు(Insurance Charges): రుణ భద్రతా బీమాను (Loan Protection Insurance) కొన్ని బ్యాంకులు తప్పనిసరి కాకపోయినా డిఫాల్ట్‌గా చేర్చుతాయి. కస్టమర్ స్వయంగా తొలగించుకోవాలి.
🔹 అవసరానికి ముందు చెల్లింపు (Prepayment) లేదా ఫోర్క్లోజర్ ఛార్జీలు: రుణాన్ని ముందుగా పూర్తిగా చెల్లిస్తే 2% నుంచి 5% వరకు బ్యాంకులు వసూలు చేయొచ్చు. అయితే ఫ్లోటింగ్ వడ్డీ రుణాలపై ఈ ఛార్జీలను తొలగించేందుకు RBI ఓ కొత్త మార్గదర్శక సర్క్యులర్ రూపొందిస్తోంది.
🔹 లేట్ పేమెంట్ ఫీజు(Late payment Fee): ఒక EMI మిస్ అయితే 2% నుంచి 4% వరకు అదనపు శాతం పెనాల్టీగా వసూలు చేయబడుతుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది.
🔹 EMI బౌన్స్ ఛార్జీలు (Bounce charges): బ్యాంకు ఖాతాలో సరిపడిన నిధులు లేకపోతే, EMI బౌన్స్ అయితే ₹500 – ₹1000 + GST అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఈ మొత్తం మీద అదనపు పెనాల్టీ వడ్డీ కూడా వసూలు చేస్తాయి.
🔹 లోన్ క్యాన్సిలేషన్ ఛార్జీలు (Loan Cancellation Charges): రుణం మంజూరు అయ్యాక క్యాన్సిల్ చేస్తే ₹1000 – ₹3000 వరకు బ్యాంకులు వసూలు చేస్తాయి.
🔹 డాక్యుమెంటేషన్ ఛార్జీలు (Documentation Charges): కొన్ని బ్యాంకులు ₹500 – ₹2000 వరకు డాక్యుమెంటేషన్ లేదా ఒప్పంద సంతకం ఫీజుగా వసూలు చేస్తాయి.
🔹 లోన్ కన్వర్షన్ ఛార్జీలు (Loan conversion Charges): కాలపరిమితిని మార్చుకోవడానికి లేదా తక్కువ వడ్డీ రేటుకు మారడానికి 0.5% – 2% వరకు అదనపు ఛార్జీలు పడతాయి.
🔹 స్టాంప్ డ్యూటీ & లీగల్ ఛార్జీలు: బ్యాంకులు స్టాంప్ డ్యూటీ మరియు రుణ ఒప్పందాల పరిశీలన కోసం కూడా కొన్ని రాష్ట్రాల్లో చార్జీలు వసూలు చేస్తాయి.
గమనిక: రుణం తీసుకోవడంలో కొన్ని రిస్కులు ఉంటాయి. కాబట్టి ముందుగా అన్ని చార్జీలను పూర్తిగా తెలుసుకుని, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది!
మీ డబ్బును బ్యాంకులకు అలా విడిచిపెట్టకండి – ఈ అదనపు ఛార్జీలను తప్పించుకోవడం ఎలా అనే విషయాన్ని ముందే తెలుసుకోండి.