తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు లిస్ట్ 2 (Indiramma Illu List 2 Telangana 2025) ను విడుదల చేసింది. ఇందిరమ్మ ఇల్లు పథకానికి దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరు ఇకపై ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే మీ పేరు లిస్ట్‌లో ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇందుకు అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించి, మీ ప్రాథమిక వివరాలు నమోదు చేయాలి.
లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అంటే ఏమిటి?
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకం కింద లబ్ధిదారులను మూడు భాగాలుగా విభజించింది:
లిస్ట్ 1 – భూమి ఉన్నా, ఇంటి కోసం డబ్బు లేని వారికి
Related News
లిస్ట్ 2 – ఇల్లు లేదా భూమి ఏదీ లేని వారికి
లిస్ట్ 3 – ఇప్పటికే ఇల్లు లేదా ఫోర్ వీలర్ ఉన్న వారికి
అర్హతలు:
- తెలంగాణ రాష్ట్రస్థాయి నివాసి కావాలి.
- తక్కువ ఆదాయం గల లేదా మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఇప్పటికే తెలంగాణలోని ఇతర గృహ పథకాలలో పేరు లేకుండా ఉండాలి.
- ఇంతకుముందు ఎలాంటి పర్మనెంట్ హౌస్ ఉండకూడదు.
ఆర్థిక ప్రయోజనాలు
ఎంపికైన లబ్ధిదారులకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేయబడుతుంది.
అవసరమైన డాక్యుమెంట్స్:
- ఆధార్ కార్డు
- మొబైల్ నెంబర్
- రేషన్ కార్డు నెంబర్
- దరఖాస్తు ID నెంబర్
పథక విశేషాలు:
- పెండింగ్ లిస్ట్: ఇంకా ప్రాసెస్‌లో ఉన్న దరఖాస్తుదారుల పేర్లు విడుదల.
- ఇళ్ల నిర్మాణం: 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3,500 ఇళ్లు నిర్మించనున్నారు.
- L3 కేటగిరీ: ఇప్పటికే ఇల్లు లేదా కార్ ఉన్న వారు ఇందులోకి చేరుస్తారు.
- 5 లక్షల ఆర్థిక సహాయం: ఎంపికైన లబ్ధిదారులకు అందజేయబడుతుంది.
మీరు ఇందిరమ్మ ఇల్లు లిస్ట్ 2లో ఉన్నారా? ఇలా చెక్ చేయండి!
Step 1: Indiramma Illu అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించండి.
Step 2: “Application Search” అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.
Step 3: కొత్త పేజీలో మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేయండి.
Step 4: వివరాలు సరిచూసుకొని “Submit” బటన్‌పై క్లిక్ చేయండి.
Step 5: మీ పేరు లిస్ట్‌లో ఉందో లేదో తేలిపోతుంది!
హెల్ప్‌లైన్ నంబర్
040-29390057
మీ పేరు లిస్ట్‌లో ఉందో లేదో వెంటనే చెక్ చేయండి! ₹5 లక్షల ప్రయోజనం మిస్ కాకండి!