సినిమా టికెట్లపై అదిరిపోయే ఆఫర్లు! టాప్ 5 క్రెడిట్ కార్డులు ఇవే!

ఇప్పటి కాలంలో క్రెడిట్ కార్డ్స్ వాడటం సర్వసాధారణం. షాపింగ్, సినిమాలకి వెళ్లే వాళ్లు క్రెడిట్ కార్డ్ ఉపయోగించడం వల్ల అదనంగా ప్రయోజనాలు పొందవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

క్రెడిట్ కార్డు ద్వారా సినిమా టికెట్ కొనుగోలు చేసినప్పుడల్లా 10% అదనపు డిస్కౌంట్ రావడం, లేక షాపింగ్ చేస్తే రివార్డ్ పాయింట్స్ రూపంలో క్యాష్‌బ్యాక్ పొందటం—ఇవి వినిపించగానే అద్భుతంగా అనిపిస్తుందా? అయితే మీ కోసం కొన్ని బెస్ట్ క్రెడిట్ కార్డుల వివరాలు ఇవే!

సినిమా టికెట్లపై ఉత్తమ ఆఫర్లు ఇచ్చే క్రెడిట్ కార్డులు:

1. SBI కార్డ్ ఎలైట్

  • ఈ కార్డ్ ద్వారా ప్రతి సంవత్సరం ₹6,000 విలువైన ఉచిత సినిమా టికెట్లు పొందవచ్చు.
  • నెలకి రెండు బుకింగ్‌ల వరకూ ఈ ఆఫర్ వర్తిస్తుంది.
  • ఒక్కో టికెట్‌పై గరిష్టంగా ₹250 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
  • అయితే, కన్వీనియన్స్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
  • అదనంగా, ₹5,000 విలువైన ఈ-గిఫ్ట్ వోచర్ కూడా లభిస్తుంది.

2. ICICI బ్యాంక్ కోరల్ క్రెడిట్ కార్డ్

  • ఈ కార్డ్ ద్వారా BookMyShow మరియు Inox లో టికెట్లు బుక్ చేసుకుంటే 25% డిస్కౌంట్ (గరిష్టంగా ₹100) పొందవచ్చు.
  • ఒక్కో ట్రాన్సాక్షన్‌లో కనీసం రెండు టికెట్లు బుక్ చేసుకోవాలి.
  • నెలకి రెండు సార్లు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
  • అయితే, ఈ కార్డ్ జాయినింగ్ ఫీ ₹500+GST ఉంటుంది.

3. యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డ్

  • ఈ కార్డ్ ద్వారా ది డిస్ట్రిక్ యాప్ ద్వారా సినిమా టికెట్ బుక్ చేస్తే, రెండో టికెట్ ఉచితం.
  • నెలకి ₹200 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
  • కార్డ్ యూజర్లు AXIS200 కూపన్ కోడ్ ఉపయోగించాలి.
  • కానీ, సినిమా టికెట్ బుకింగ్ పై ఎలాంటి రివార్డ్ పాయింట్స్ పొందలేరు.

4. కోటక్ PVR ప్లాటినం క్రెడిట్ కార్డ్

  • నెలకి రెండు ఉచిత PVR సినిమా టికెట్లు పొందవచ్చు. (ఒక్కోటి ₹400 వరకు).
  • అయితే, నెలకి కనీసం ₹10,000 ఖర్చు చేసినప్పుడు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
  • డైరెక్టర్‌స్ కట్, PVR IMAX, గోల్డ్ క్లాస్, యూరోపా ఎగ్జిక్యూటివ్ టికెట్‌లకు ఈ ఆఫర్ వర్తించదు.

5. RBL బ్యాంక్ పోప్‌కార్న్ క్రెడిట్ కార్డ్

  • BookMyShow ద్వారా టికెట్లు బుక్ చేస్తే ₹500 డిస్కౌంట్ లభిస్తుంది.
  • సినిమా టికెట్ కొంటే అదనంగా ₹100 విలువైన ఫుడ్ & బేవరేజెస్ ఉచితంగా పొందవచ్చు.

(గమనిక: పై జాబితా సూచనల కోసం మాత్రమే, పూర్తి వివరాల కోసం సంబంధిత బ్యాంక్ వెబ్‌సైట్‌ను సందర్శించండి. క్రెడిట్ కార్డులు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి!)

Related News