Accident: కుంభమేళాకు వెళ్లి తిరిగిరాని లోకాలకు..

మహా కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవంలో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించడానికి దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తున్నారు. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక కుటుంబం కారులో మహా కుంభమేళాకు వెళ్లింది. వారు అక్కడ పుణ్య స్నానాలు ఆడి తిరిగి వచ్చారు. ఇక్కడి వరకు అంతా సజావుగా సాగింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

దురదృష్టవశాత్తు, ఘోర ప్రమాదం జరిగింది. కారు లారీని ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి, ఆయన భార్య విలాసిని, కారు డ్రైవర్ న్యాల్‌కల్ మండలానికి చెందిన మల్లారెడ్డి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.