మైలేజ్ కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని, హోండా యాక్టివా CNG స్కూటర్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ స్కూటీని తక్కువ ధరకే తీసుకువస్తున్నారు. ఇప్పటివరకు ఈ స్కూటీకి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. ఈ ఏడాది చివరి నాటికి ఈ స్కూటీని తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ స్కూటర్‌లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయో? ధర ఎంత? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Honda Activa CNG అడ్వాన్స్‌డ్ ఫీచర్లు
ఆక్టివా CNGలో హోండా అద్భుతమైన ఫీచర్లను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్లు నెట్‌లో వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారం..
Related News
డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
డిజిటల్ ఓడోమీటర్, డిజిటల్ ట్రిప్ మీటర్
LED హెడ్‌లైట్, LED ఇండికేటర్లు
ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు
యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)
ట్యూబ్‌లెస్ టైర్లు, అల్లాయ్ వీల్స్
ఈ స్కూటర్ ఆధునిక రూపాన్ని అందించడమే కాకుండా భద్రత మరియు సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందించే ఫీచర్లను కూడా అందిస్తుంది.
పనితీరు, మైలేజ్
పనితీరు పరంగా.. హోండా Activa CNG శక్తివంతమైన ఇంజిన్‌తో తీసుకురాబడే అవకాశాలు ఉన్నాయి. ఈ స్కూటర్‌లో 110cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ అమర్చబడి ఉంటుంది. ఇది గరిష్టంగా 7.79 bhp శక్తిని, 8.17 Nm టార్క్ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. మైలేజీని ఈ స్కూటర్ ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ స్కూటర్ ఒకే ఫుల్ ట్యాంక్‌పై 320 నుండి 400 కిలోమీటర్లు ప్రయాణించగలదని తెలుస్తోంది. పెట్రోల్ వెర్షన్‌తో పోలిస్తే ఈ మైలేజ్ చాలా ఎక్కువ.
ధర ఎంత?
ధరకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఈ స్కూటీ రూ. 85,000 నుండి రూ. 90,000 ఎక్స్-షోరూమ్ ధరలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
పర్యావరణ అనుకూలంగా ఉండటమే కాకుండా ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి ఈ స్కూటీ ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. ప్రతిరోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారి కోసం కూడా ఈ స్కూటీ సెట్ చేయబడుతుంది. ఈ స్కూటీ ధర మరియు లక్షణాలకు సంబంధించి హోండా త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ హోండా యాక్టివా CNG వేరియంట్ భారత మార్కెట్లో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూద్దాం.