హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు పెద్ద శుభవార్త చెప్పింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236 పోస్టులను భర్తీ చేయనున్నారు.
సంబంధిత శాఖ మంత్రి సీతక్క 6399 అంగన్వాడీలు, 7837 హెల్పర్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఫైల్‌పై సంతకం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు.
మొత్తం పోస్ట్ లు : 14,236
- అంగన్వాడీ టీచర్ పోస్ట్ లు : 6399
- అంగన్వాడీ హెల్పేర్ పోస్ట్ లు : 7837
- అర్హత : పది పాస్ అవ్వాలి.
ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జిల్లాల వారీగా కలెక్టర్లు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఒకేసారి 14,236 పోస్టుల భర్తీపై మంత్రి సీతక్క స్పందించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఒకేసారి 14 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. తాజా పోస్టుల భర్తీతో అంగన్వాడీలు మరింత బలంగా పనిచేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.