Mahesh Babu: మహేష్ బాబు వాళ్ళతో సినిమాలు చెయ్యడు.. పూరి జగన్నాధ్ సంచలన కామెంట్స్..

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు పరిచయం అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరోలను, స్టార్ పిల్లలను పరిచయం చేయాలనుకుంటే, లేదా ఇప్పటికే స్థిరపడిన హీరోలకు మాస్ ఇమేజ్ తీసుకురావాలనుకుంటే, పూరి తర్వాత మరెవరూ దీన్ని చేయలేరు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాగార్జున, రామ్ చరణ్, బన్నీ, రెబల్ స్టార్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి టాలీవుడ్ స్టార్లందరితో కలిసి పనిచేసిన పూరి జగన్నాధ్ వారి కెరీర్లను మలుపు తిప్పాడు. పూరితో కలిసి పనిచేసిన తర్వాత ఈ హీరోల ఇమేజ్ మరింత పెరిగింది. కానీ ఇప్పుడు పూరి కష్టకాలంలో ఉన్నాడు.

వరుస ఫ్లాపులు ఆయనను తీవ్రంగా దెబ్బతీశాయి. ప్రస్తుత కథలకు సిద్ధంగా ఉన్న హీరోలు డేట్స్ ఇవ్వడం లేదని చెబుతున్నారు. అయితే, పూరి, మహేష్ బాబు కాంబినేషన్ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పలేము. మరి వారి కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో? అభిమానులందరూ దాని కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పూరి, మహేష్ బాబు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

మహేష్ తో సినిమా చేస్తారా అని యాంకర్ అడిగినప్పుడు, “మీరు నమ్మలేని విషయం ఏంటంటే… నేను సక్సెస్ లో ఉన్నపుడే మహేష్ నాతో సినిమా చెయ్యటానికి ఇష్టం చూపిస్తాడు.. ప్రస్తుతం నేను డౌన్ లో ఉన్నాను. కాబట్టి మహేష్ కి నాపై నమ్మకం లేదు.. మహేష్ ఫాన్స్ మాత్రం నన్ను విపరీతం గా నమ్ముతారు. అందుకే వాళ్లంటే నాకు ఇష్టం..

నా కెరీర్ మళ్ళీ గాడిలో ప్పడి సక్సెస్ అందుకుంటే మహేష్ నాతో సినిమాకి ఒప్పుకుంటాడు అని పూరి చెప్పటం ఇపుడు సంచలనం గా మారింది..