తెలంగాణలో గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది. ఈ నెల 27న పోలింగ్ తేదీ ఉన్నందున, ఆ రోజు ఎమ్మెల్సీ ఓట్లు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఇచ్చారు. మరోవైపు.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లకు సంబంధించి కూడా సీఈఓ కీలక సూచనలు చేశారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాలతో పాటు, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి.
Holiday : ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రోజు ప్రత్యేక సెలవు..!!

22
Feb