జడ్చర్లలోని నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (NMIMS) విశ్వవిద్యాలయంలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. జడ్చర్ల మండలం పోలేపల్లిలోని NMIMS విశ్వవిద్యాలయంలో ఫుడ్ పాయిజనింగ్ తిన్న తర్వాత 80 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. అయితే, హాస్టల్ నిర్వాహకులు విషయం బయటకు రానివ్వకుండా విశ్వవిద్యాలయం నుండి వైద్యులను పిలిపించి విద్యార్థులకు వైద్య చికిత్స అందించడానికి ప్రయత్నించారు. అయితే, వారి ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో విషయం బయటపడింది. మొదట్లో 27 మంది విద్యార్థులకు మాత్రమే ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని హాస్టల్ నిర్వాహకులు ప్రకటన ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం.. మొత్తం 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. బయటి ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని నిర్వాహకులు చెబుతుండగా హాస్టల్ ఆహారం తిన్న తర్వాత తాము అస్వస్థతకు గురయ్యామని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Food Poison: యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 80 మంది విద్యార్థులకు అస్వస్థత

21
Feb