తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మూడు ఎకరాల వరకు సాగు భూములకు ఎకరానికి రూ. 6,000 రైతు భరోసా నిధులను జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం జనవరి 26న ప్రభుత్వ నిధులను జమ చేయడం ప్రారంభించింది. ఫిబ్రవరి 5న 17.03 లక్షల మందికి, ఫిబ్రవరి 10న 8.65 లక్షల మందికి విడతలవారీగా నిధులు జమ చేసినట్లు ప్రకటించారు.
Related News
ఇప్పటివరకు, 2 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న 34 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2200 కోట్లు జమ అయ్యాయి.
మొత్తం 37 లక్షల ఎకరాలకు పెట్టుబడి సహాయం నగదు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.