కొన్ని గంటల్లో వాలెంటైన్స్ డే రాబోతోంది. యువత ఇప్పటికే వాలెంటైన్స్ వీక్ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లు, మాల్స్, టూర్ ప్లానింగ్ కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇటీవల ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ప్రేమికుల కోసం ఒక క్రేజీ ఆఫర్ ప్రకటించింది. నాలుగు రోజుల పాటు సగం ధరకే జంటలకు టిక్కెట్లను అందిస్తోంది. వివరాలు తెలుసుకుందాం.
అత్యల్ప ధరలకు ప్రయాణీకులకు ఉత్తమ సేవలను అందించే ఇండిగో వాలెంటైన్స్ డే సేల్‌ను తీసుకువచ్చింది. ఈ సేల్ ద్వారా ఎంపిక చేసిన దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణానికి విమాన టిక్కెట్ల బుకింగ్‌లపై 50 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. అయితే, ఇద్దరు ప్రయాణికులు కలిసి టిక్కెట్లు బుక్ చేసుకుంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఇండిగో తెలిపింది. ఈ ఆఫర్ ఈ నెల 16వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే, బుకింగ్ తేదీకి, ప్రయాణ తేదీకి మధ్య కనీసం 15 రోజుల సమయం ఉండాలని వెల్లడించింది.
టికెట్ ధరలతో పాటు కస్టమర్లు ట్రావెల్ యాడ్-ఆన్‌లపై కూడా డిస్కౌంట్లను పొందవచ్చని ఇండిగో తెలిపింది. మీరు ప్రీ-బుక్ చేసిన అదనపు లగేజీపై 15 శాతం తగ్గింపు, సీటు ఎంపికపై 15 శాతం తగ్గింపు, ప్రీ-ఆర్డర్ చేసిన భోజనంపై 10 శాతం తగ్గింపు పొందవచ్చు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్, ఇండిగో 6E AI చాట్‌బాట్, ఎంపిక చేసిన ట్రావెల్ పార్టనర్‌లలో టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
Related News
దీనితో పాటు ఫిబ్రవరి 14న ఇండిగో మరో ఫ్లాష్ సేల్‌ను కూడా నిర్వహించనుంది. ఈ ఫ్లాష్ సేల్ ఫిబ్రవరి 14న రాత్రి 8 గంటల నుండి రాత్రి 11.59 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో వెబ్‌సైట్/మొబైల్ యాప్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న మొదటి 500 మందికి అదనంగా 10% తగ్గింపు లభిస్తుంది. ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ట్రిప్ ప్లాన్ చేసుకునే జంటలకు ఈ ఆఫర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీలైనంత త్వరగా మీ గమ్యస్థానానికి టిక్కెట్లు బుక్ చేసుకోండి.