విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో ‘VD 12’
ఈ చిత్రానికి ‘కింగ్డమ్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు
తారక్ వాయిస్‌తో విడుదలైన టీజర్ మరింత పవర్‌ఫుల్‌గా ఉంది
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో ‘VD 12’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న కొత్త సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా టైటిల్‌ను కూడా మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి ‘కింగ్డమ్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు.
టీజర్‌కు ఎన్టీఆర్ తన వాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే. తారక్ వాయిస్‌తో విడుదలైన టీజర్ మరింత పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. విజయ్ లుక్ కూడా భిన్నంగా ఉంది. అతని యాక్షన్ ఎపిసోడ్లు మరియు ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మొత్తంమీద, ఈ టీజర్‌తో మేకర్స్ సినిమాపై అంచనాలను పెంచారు.