జూనియర్ లెక్చరర్ అభ్యర్థులకు ఈ నెల 13 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం.

కొత్తగా ఎంపికైన జూనియర్ లెక్చరర్ అభ్యర్థులకు ఈ నెల 13 నుండి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ ఆర్జేడీ జయప్రద బాయి విడుదల చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ ప్రక్రియ ఈ నెల 19 వరకు కొనసాగుతుందని ప్రకటించారు. మొత్తం 1286 మందిని కౌన్సెలింగ్‌కు పిలిచారు, వీరిలో మల్టీజోన్ 1 నుండి 659 మంది మరియు మల్టీజోన్ 2 నుండి 627 మంది పాల్గొంటారు.

వీరికి కౌన్సెలింగ్ ప్రక్రియ హైదరాబాద్‌లోని గన్ ఫౌండ్రీలోని మహాబూబియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతుంది. మల్టీజోన్ 1 అభ్యర్థులకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మరియు మల్టీజోన్ 2 అభ్యర్థులకు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కౌన్సెలింగ్ నిర్వహించబడుతుంది. 13న 214 మంది అభ్యర్థులకు, 14న 215 మంది అభ్యర్థులకు, 15న 215 మంది అభ్యర్థులకు, 17న 214 మంది అభ్యర్థులకు, 18న 213 మంది అభ్యర్థులకు, 19న 215 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అయితే, వాటికి సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఇప్పటికే పూర్తయినందున, సబ్జెక్టుల వారీగా కౌన్సెలింగ్ నిర్వహించి, కళాశాలలను కేటాయించనున్నారు.