పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రెబల్ స్టార్ ఇటీవల రెండు బ్లాక్ బస్టర్ సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ సంచలన విజయం సాధించింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. సలార్ రూ. 700 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా రెండవ భాగం కూడా తీయబడుతుంది. అలాగే, ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా చేసాడు. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. కల్కి బాక్సాఫీస్ ను షేక్ చేసింది.. రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. త్వరలో రాజా సాబ్ తో తెరపైకి రానున్నారు. మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగాతో కలిసి స్పిరిట్, ప్రశాంత్ సలార్ 2, కల్కి 2 సినిమాలు చేస్తున్నాడు. వీటితో పాటు హనురాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా కూడా చేస్తున్నాడు. హను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఫౌజీ అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమా యుద్ధ నేపథ్యంతో ఉంటుందని చెబుతున్నారు.
ఇంతలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుందని కూడా ధృవీకరించారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఫౌజీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందని తెలిసింది. పీరియాడిక్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ కథలో సాయి పల్లవి హీరోయిన్ గా ఉంటే బాగుంటుందని భావించి దర్శకుడు ఆమెను సంప్రదించినట్లు తెలిసింది. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. సాయి పల్లవి గతంలో హనురాఘవపూడి దర్శకత్వంలో పడిపడి లేచే మనసు అనే సినిమా చేసిన విషయం తెలిసిందే.