తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇంటర్ బోర్డు గతంలో ఆదేశాలు జారీ చేసింది.
అయితే, కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నందున, ఆ కళాశాలలకు పరీక్షా కేంద్రాలను అందించబోమని బోర్డు స్పష్టం చేసింది.