Maha Kumbh Mela 2025: ఏపీ నుంచి కుంభమేళాకు స్పెషల్ ట్రైన్లు.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా కోసం ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైళ్ల వివరాలను తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ నంబర్ 07117 ఈ నెల 14న రాత్రి 11.45 గంటలకు తిరుపతి జంక్షన్ నుండి బయలుదేరుతుంది. ఈ రైలు రెండు రోజుల పాటు ప్రయాణించి రాత్రి 11.55 గంటలకు దానపూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అదే రైలు (07118) 17న మధ్యాహ్నం 3.15 గంటలకు అక్కడి నుండి బయలుదేరుతుంది. ఇది రెండు రోజుల పాటు ప్రయాణించి మధ్యాహ్నం 1.45 గంటలకు తిరుపతి జంక్షన్‌కు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, డోన్, కర్నూలు, గద్వాల్, వనపర్తి రోడ్, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, లధోనగర్, కాచేగూడ, మల్కాజ్ గిరి, చెర్లపల్లి, ఖాజీపేట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ నెల 18న మరో ప్రత్యేక రైలు

తిరుపతి-దానపూర్ మార్గంలో మరో ప్రత్యేక రైలు (07119)ను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ఈ నెల 18న రాత్రి 11.45 గంటలకు తిరుపతి జంక్షన్ నుండి బయలుదేరుతుంది. ఇది రెండు రోజులు ప్రయాణించి రాత్రి 11.55 గంటలకు దానపూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అదే రైలు (07120) ఈ నెల 21న మధ్యాహ్నం 3.15 గంటలకు దానపూర్ నుండి బయలుదేరుతుంది. రెండు రోజుల తర్వాత మధ్యాహ్నం 1.45 గంటలకు తిరుపతి జంక్షన్‌కు చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూరు, కృష్ణ, యాదగిరి, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, చెర్లపల్లి,ఖాజీపేట స్టేషన్లలో కూడా ఆగుతుంది.

Related News

మచిలీపట్నం నుండి కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం మచిలీపట్నం నుండి యూపీలోని దానపూర్‌కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లలో ఒకటి మచిలీపట్నం నుండి దానపూర్‌కు వెళ్తుంది మరొక రైలు దానపూర్ నుండి మచిలీపట్నంకు వస్తుంది. ఈ నెల 8, 16 తేదీలలో ఉదయం 11 గంటలకు మచిలీపట్నం నుండి బయలుదేరే ప్రత్యేక రైళ్లు మరుసటి రోజు రాత్రి 11.55 గంటలకు దానపూర్‌కు చేరుకుంటాయి. ఈ నెల 10, 18 తేదీలలో మధ్యాహ్నం 3.15 గంటలకు దానపూర్ నుండి బయలుదేరే ప్రత్యేక రైళ్లు రెండవ రోజు తెల్లవారుజామున 3 గంటలకు మచిలీపట్నంకు తిరిగి వస్తాయి. ఈ రైళ్లు గుడివాడ, విజయవాడ, కొండపల్లి, ఖమ్మం, డోర్నకల్, మహబబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్ష, చంద్రాపూర్, సేవాగ్రామ్, నాగ్‌పూర్, ఝార్‌పూర్, ఇటార్సీ, జబల్‌పూర్, ఇటార్సీ, మీదుగా దానాపూర్‌కు వెళ్తాయి. మాణిక్‌పూర్ జంక్షన్, ప్రయాగ్‌రాజ్ చౌకీ, మీర్జాపూర్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్, బక్సర్, ఆరా.