ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రేమికులు తమ అనురాగాన్ని వ్యక్తపరచడానికి బహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. క్రైస్తవ మతాలు కూడా ప్రేమికుల దినోత్సవాన్ని సెయింట్ వాలెంటైన్స్ డేగా జరుపుకుంటాయి. ఇది ప్రేమికుల త్యాగానికి చిహ్నంగా చెబుతారు. ప్రేమికుల దినోత్సవాన్ని ఎక్కువగా కెనడా, అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, ఇండియా, ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్, డెన్మార్క్‌లలో జరుపుకుంటారు. అయితే, ప్రేమికుల దినోత్సవం రోజున ప్రేమికులు కూడా కొన్ని రొమాంటిక్ ప్రదేశాలకు వెళ్లి ఆనందించాలని కోరుకుంటారు.
ఇవన్నీ కాకుండా అమ్మాయిలు తమ ముఖాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. మొటిమలు ముఖ్యంగా మహిళలను వెంటాడే సమస్య. ఈ సమస్యను అరికట్టడానికి, మీ ముఖం ప్రకాశవంతంగా ప్రకాశింపజేయడానికి.. నిపుణులు ఇంట్లో ఈ సాధారణ చిట్కాలను అనుసరించాలని సూచిస్తున్నారు.
అయితే, శరీరంలో హార్మోన్ల స్థాయిలు ప్రభావితమైనప్పుడు, ముఖంపై మొటిమల సమస్య తలెత్తుతుంది. దీనివల్ల ముఖం మెరుపు తగ్గుతుంది. జంక్ ఫుడ్, నూనె పదార్థాలు తినడం వల్ల మొటిమలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి వాలెంటైన్స్ డే నాడు మీ ముఖం అందంగా మెరిసిపోవాలంటే, ఈ చిట్కాలను అనుసరించండి.
Related News
కొద్దిగా నిమ్మరసం, బేకింగ్ సోడా, రోజ్ వాటర్ కలిపి ఈ మూడింటినీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. అలాగే గోరువెచ్చని నీటిలో లవంగాల పొడిని కలిపి మొటిమలపై అప్లై చేయండి. మరుసటి రోజు చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. దీనితో పాటు జాజికాయ పొడి, కలబందను కలిపి ముఖానికి అప్లై చేయండి. ఇలా చేస్తే ముఖం మెరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.