థమ్స్ అప్ యాడ్ లో Allu Arjun: ఇటీవలి కాలంలో మన తెలుగు హీరోలు సినిమాలతో పాటు యాడ్స్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ ను థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఇటీవల బన్నీ థమ్స్ అప్ కోసం కొత్త యాడ్ లో నటించాడు. థమ్స్ అప్ తన సోషల్ మీడియాలో ఈ యాడ్ ని పోస్ట్ చేసింది.
కొత్త యాడ్ లో ఐకాన్ స్టార్ట్ చెప్పిన ‘పరిస్థితి ఎలా ఉన్నా సరే కాస్త తాగండి’ అనే డైలాగ్ హిట్ అయింది. ఈ యాడ్ అల్లు అర్జున్ అభిమానులను, థమ్స్ అప్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్లు థమ్స్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. అల్లు అర్జున్ విషయానికొస్తే, ఇటీవల పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించాడు. ఈ సినిమా రూ. 1850 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.