భారతదేశంలో ప్రయాణిస్తున్నప్పుడు స్థానికుల నుండి వచ్చే సెల్ఫీ అభ్యర్థనలను ఎలా ఎదుర్కొంటారో ఒక రష్యన్ మహిళ తన తెలివైన విధానాన్ని ప్రదర్శించిన ఆసక్తికరమైన వైరల్ వీడియో ఇది.
విదేశీ సందర్శకులను వారితో ఫోటో దిగడానికి ఆసక్తిగా ఉన్న భారతీయ స్థానికులు వారిని ఎలా సంప్రదిస్తారో ఈ వీడియో హైలైట్ చేసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి, ఆ మహిళ ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని రూపొందించింది: ప్రతి సెల్ఫీకి రూ. 100 వసూలు చేయడం. ఇలా చేయటం వల్ల ఆమెకి ఫోటోలు తీసుకునే జనల సంఖ్య తగ్గటం కాకుండా డబ్బులు సంపాదించే అవకాశం కూడా కల్పించింది.
దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, విదేశీయులు భారతీయ బీచ్లను చూడటానికి రావడం చాలా కష్టం అని ఆమె రాసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు ఆమెపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలా డబ్బు సంపాదించడానికి మీకు వర్కింగ్ వీసా ఇచ్చారా అని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు మీ పని చాలా బాగుంది, మీ భారత పర్యటనను ఆస్వాదించండి అని వ్యాఖ్యానిస్తున్నారు.