ప్రపంచంలోనే భారతదేశానికి ఎంతో చరిత్ర ఉంది. దేశ చరిత్రలో ఎందరో గొప్ప గొప్ప పండితులు కూడా ఉన్నారు. వారిలో ఆచార్య చాణుక్యుడు ఒకరు. ఆయన మాటలకు అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈయన చెప్పిన మాటలను ఎందరో అనుసరించి విజయాలు అందుకుంటున్నారు. చాణిక్యుడు ప్రతి ఒక్కరి జీవితంలోని ప్రతి ఒక రంగం గురించి అద్భుతమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఈ జ్ఞానాన్ని జనాలకు పంచేందుకు ఎన్నో విధానాలను రాశారు. అయితే ఈరోజు చాణక్య నీతిలో పేర్కొన్న కొన్ని విధానాల గురించి తెలుసుకుందాం. ఇవి ఒక వ్యక్తి చిన్న వయసులోనే ధనవంతుడిని చేస్తాయి. అడుగడుగునా ఏది ప్రయత్నించిన అందులో విజయాన్ని అందుకునేలా చేస్తాయి. అలాంటి మూడు అలవాట్ల గురించి ఇప్పుడు మన ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
సమయ ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నవారు
ప్రతి ఒక్కరి జీవితంలో కేవలం 24 గంటలు మాత్రమే ఉంటాయి. అయితే వాటిని ఎలా ఉపయోగించుకున్నాం అన్నదే ముఖ్యం. సమయం చాలా విలువైనది. ఒకసారి సమయం వృధా అయితే అది తిరిగి మళ్ళీ రాదు. అలాంటి సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న వ్యక్తులు మాత్రమే విజయాన్ని అందుకుంటారు. అలాంటి వారిని ఎవరు ఆపలేరని చాణక్యుడు అంటున్నారు. చాణక్య నీతి ప్రకారం.. మానవ జీవితంలోని ప్రతిక్షణం ఎంతో విలువైంది. ఈ విలువను అర్థం చేసుకున్న వాడు జీవితంలో ఎవ్వరు ఊహించనంత ఎత్తుకు ఎదుగుతాడు. చాలా తక్కువ సమయంలోనే అత్యున్నత విజయాలను అందుకుంటాడు.
Related News
హార్డ్ వర్క్ చేసే వ్యక్తులు
కష్టపడితే రానిది లేదంటూ అందరూ అంటుంటారు. ఇప్పుడు కష్టపడితేనే పెద్దయ్యాక సుఖపడుతారు. ఆచార్య చాణక్యుడి ప్రకారం.. ప్రతి విజయానికి ఒక సూత్రం ఉంటుంది. కష్టపడి పనిచేయడం, కష్టపడి పని చేసే వారికి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా అవి ఎక్కువ రోజులు ఉండవు. చిన్న వయసులోనే కష్టపడితే ఉన్నత స్థాయికి వెళ్తారు. జీవితాంతం కష్టపడి పని చేసే వారికి విజయం ఎక్కువ రోజులు దూరంగా ఉండదు. కష్టపడి పని చేసే వ్యక్తితోనే లక్ష్మీదేవి కూడా సంతోషంగా ఉంటుందని ఆచార్య తన పాలసీలో పేర్కొన్నారు. అసలు హార్డ్ వర్క్ అంటే ఏంటి? గాడిద పనులు చేసుకుంటూ వెళ్ళటమా? చేసే పనినే సరైన దశలో చేయటం. సరైన దశలో ప్రయత్నాలు చేస్తే విజయాన్ని అందుకోవడం సులభం. అయితే కష్టపడి పనిచేయకుండా ఉండేవారు ఎప్పటికి విజయం సాధించలేరు.
వాక్చాతుర్యం ఉపయోగం తెలిసినవారు
నిజానికి వాక్చాతుర్యం ఉన్నవారు జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తారు. నిజానికి వీరి విజయంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. దీంతో చిన్న వయసులోనే ధనవంతులు కూడా అవుతారు. మాటలు తెలిసిన వ్యక్తి తనకంటూ ఒక మార్గాన్ని వెతుక్కుంటాడు. అయితే స్వీట్ గా మాట్లాడే వారు తన శత్రువులను కూడా మిత్రులుగా మార్చు పోగలడని ఆచార్య చాణక్యుడు అంటారు. ఏ వయసులో, ఈ సమయంలో, ఏం మాట్లాడాలి. ఇవన్నీ తెలిసినవారు ధనవంతులవుతారు. ఇక ముఖ్యంగా పెద్దవారితో ఏ విధంగా మాట్లాడుతున్నామో తెలిసి ఉండాలి. రాక్షతుర్యం ఉన్నవారు జీవితంలో విజయవంతులవుతారని చాణక్యుడు అంటున్నాడ