ఇంట్లో ఎలాంటి శుభకార్యం ఉన్న బంగారం కొనుగోలు చేస్తాం. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పండుగలు ఇలా అనేక సందర్భాల్లో పసిడిని కొనుగోలు చేస్తారు. అయితే బంగారం ధరలు ఎప్పటికీ స్థిరంగా ఉండవు. ఒకరోజు బంగారం ధరలు పెరిగితే, మరుసటి రోజు బంగారం ధరలు తగ్గుతాయి. ఇటీవల బంగారు ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. బంగారాన్ని మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. వారికి ఎక్కువ బంగారం ఉంటే అంత గౌరవంగా భావిస్తూ ఉంటారు. దీంతో మన దేశంలో పెద్ద ఎత్తున బంగారం దిగుమతి అవుతుంది. అయితే, గత ఏడాదిలో బంగారం హెచ్చుతగ్గులు కనిపించిన ఈ కొత్త ఏడాదిలో ఆయన బంగారం ధరలు తగ్గుతాయని పసిడి ప్రియులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ, ఏడాది తొలి 3 వారాల్లోనే బంగారం ధరలు భారీగా పెరిగాయి.
ఇదిలా ఉంటే బంగారు ధరపై మరో పిడుగు పడే ఛాన్స్ కనిపిస్తోంది. వచ్చే వార్షిక బడ్జెట్లో బంగారం వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలని కేంద్రంలోని బిజెపి సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే కనుక జరిగితే బంగారం ధరలు మరింత పెరుగుతాయి. ఈ గ్రామంలో మరి బడ్జెట్ కి ముందే బంగారం కొనుగోలు చేయడం మంచిదా? కొంతకాలం ఆడాల్సిందేనా? బులియన్ మార్కెట్ నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
ఒకవేళ బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ పెంపు ప్రకటన చేస్తే బంగారం ధరలకు రెక్కలు వస్తాయి. ప్రస్తుతం ఉన్న రేట్లు వద్ద బంగారం కొనుగోలు చేయడం వ్యూహాత్మక అడుగున బులియన్ మార్కెట్లు సూచిస్తున్నారు. ఇక ఏడాది జనవరి 19 తేదీన బంగారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. అయినప్పటికీ బంగారం ధరలు మళ్ళీ పెరగక ముందుకే కొనుగోలు చేయాలని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Related News
ఇకపోతే 2024 సంవత్సరంలో జూలై 23వ తేదీన ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో బిజెపి సర్కార్ బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ 15% నుంచి 6 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో బంగారం ధరలు భారీగా తగ్గి వచ్చాయి. తర్వాత ఆగస్టు 2024 లో చూస్తే బంగారం దిగుమతులు 14 శాతం పెరిగి 10.06 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ సమయంలోనే పరదేశం నుంచి రత్నాలు, నగల ఎగుమతులు 23 శాతానికి పడిపోయాయి. దీంతో 1.99 విలియం డాలర్లకు తగ్గినట్లు ఓ నివేదిక పేర్కొంది.
పోయిన బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ తగ్గించి బంగారు ధరలను స్త్రీకరణ చేసేందుకు కేంద్రం ప్రయత్నించింది. దిగుమతి సుంకాలు తగ్గించడంతో బంగారం వినియోగం భారీగా పెరిగింది. ఇక ఇదే దేశ వాణిజ్యం లోటును భారీగా పెంచేసింది. గత వారంలో చూస్తే డాలర్ పొందుకున్నప్పటికీ బంగారం ధరలు భారీగానే పెరిగాయి. స్పాట్ మార్కెట్ నుంచి డిమాండ్ ఉండటం వల్ల డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లు బలహీనపడడంతో బంగారం ధరలు పెరిగినట్లు బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత వారంలో బంగారం 1 శాతం మేర పెరిగాయి. ఎంపీ ఎక్స్ మార్కెట్లో గత శుక్రవారం బంగారం ధర 10 గ్రాములు రూ. 79 101 వద్ద ముగిసింది. ఈ క్రమంలో ఒకవేళ ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ పెంచినట్లయితే బంగారం ధర లకు రెక్కలు వస్తాయి.
పెరుగుతున్న బంగారం దిగుమత్తులను నియంత్రించేందుకు కష్టం డ్యూటీ పెంచే ఛాన్స్ అధికంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పుడు ధరలు తక్కువగా ఉన్నప్పుడే కొనడం చాలా మంచిదని భావిస్తున్నారు. అయితే, బంగారం పెరుగుదలకు కేవలం కష్టం డ్యూటీ ఒకటే కారణం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీలో ఎలాంటి మార్పులు చేయకపోయినా బంగారం ధరలు మరి పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రపంచ భౌగోళిక అనిశ్చిత పరిస్థితులు అని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.