బెల్లం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకేనేమో ఆరోగ్య నిపుణులు భోజనం తిన్న తర్వాత ఒక్క బెల్లం ముక్క తినమని సూచిస్తారు. అయితే బెల్లం మార్కెట్లో నల్ల బెల్లం, తెల్ల బెల్లం, తాటి బెల్లం, పాకం బెల్లం అంటూ అనేక రకాలుగా దొరుకుతుంది. మరి ఇవన్నీ సహజ సిద్ధంగా తయారు చేసే ఇలాంటి సమస్య ఉండదు. ఒకవేళ రసాయనాలు కలిపి చేస్తే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో బెల్లం లో కల్తీ జరిగిందో లేదో తెలుసుకోవడం చాలా కష్టం. అయితే, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్యూర్ బెల్లాన్ని కనుక్కోవడానికి కొన్ని టిప్స్ సూచిస్తోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లంలో బేకింగ్ సోడాను ఎలా గుర్తించాలి?
Related News
బెల్లం తూకం పెరగడానికి, ఆకాశనీయంగా కనిపించడానికి బెల్లం తయారీలో బేకింగ్ సోడాను కలుపుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి కల్తీ ని కనిపెట్టేందుకు మొదటగా టెస్టుబ్ లోకి పావు టీ స్పూన్ బెల్లం తురుము వేయాలి. తర్వాత ఆ ట్యూబ్ లోకి 3ml హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపాలి. దీని తర్వాత ఒకవేళ ఒరిజినల్ బెల్లం అయితే అందులో ఎలాంటి మార్పు ఉండదు. ఇక బెల్లం మిశ్రమం పై బుడగలు వస్తే ఆ బెల్లంలో బేకింగ్ సోడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
బెల్లంలో చాక్ పౌడర్ ను ఎలా గుర్తించాలి?
ముందుగా ఒక గాజు గ్లాసులోకి వాటర్ తీసుకోండి. తర్వాత అందులోకి 10 గ్రాముల బెల్లం వేసి కరిగించండి. కొద్దిసేపు తర్వాత బెల్లం లో చాక్ పౌడర్ కలపండి. బెల్లంలో చాక్ పౌడర్ కలిస్తే అది గ్లాస్ లోకి అడుగు చేరుతుంది. ఒకవేళ కల్తీ జరగకపోతే అడుగు బాగానే ఏది ఉండదంటున్నారు.
నీటి పరీక్ష
స్వచ్ఛమైన బెల్లాన్ని కనుక్కునేందుకు ఒక గ్లాసు నీటిలో ఒక చిన్న ముక్క బెల్లం వేయండి. బెల్లం కరిగిన తరువాత అది స్వచ్ఛమైనది అయితే నీరుకి ముదురు గోధుమ రంగును ఇస్తుంది. ఒకవేళ నకిలీ బెల్లం అయితే కరగకుండా గ్లాస్ అడుగుభాగానికి వెళుతుందని లేదా నీరు తెల్లగా మారుతుందని నిపుణులు అంటున్నారు.