ఈసారి ఆటో ఎక్స్‌పో 2025 లో ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా ప్రవేశపెట్టారు. అయితే, మారుతి సుజుకి ఎలక్ట్రిక్ విటారాను ప్రవేశపెట్టగా, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ను విడుదల చేసింది. దేశంలోని వినియోగదారులలో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల క్రేజ్ నిరంతరం పెరుగుతోంది. ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలపై డబ్బు ఖర్చు చేయడం ప్రారంభించారు. కార్ల కంపెనీలు కూడా ఇప్పుడు కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మార్కెట్లో కొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. రాబోయే 2 సంవత్సరాలలో అనేక కొత్త ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి రానున్నాయి. ఈసారి ఆటో ఎక్స్‌పోలో సందడి చేసిన కార్ల గురించి తెలుసుకుందాం.
Maruti Suzuki e Vitara
మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ కారు ఇ విటారాను ఆటో ఎక్స్‌పోలో ప్రవేశపెట్టింది. కానీ, ఎలక్ట్రిక్ విటారా చాలా విషయాల్లో నిరాశపరిచింది. EV విభాగంలోకి ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ, మారుతి సుజుకి ఈ కారును డిజైన్ లో అంత కొత్తగా ఏమి లేదు. క్యాబిన్ లో సరైన ప్లేస్ ;లేదు. వెనుక సీట్ల వితరా ను పోలి ఉన్నాయి. ఇక భద్రత కోసం.. దీనికి 7 ఎయిర్‌బ్యాగ్‌లు జోడించారు. ఇది రెండు బ్యాటరీ ప్యాక్‌లతో మార్కెట్లోకి విడుదల కానున్నది.
Related News
Vayve Eva Solar Electric Car
వాయ్వే మొబిలిటీ తన మొట్టమొదటి సౌరశక్తి ఎలక్ట్రిక్ కారును ఆటో ఎక్స్‌పోలో కేవలం రూ. 3.25 లక్షల ప్రారంభ ధరకు విడుదల చేయడం ద్వారా మార్కెట్‌ను షేక్ చేసింది. ఈ కారు సౌరశక్తి, విద్యుత్ శక్తి రెండింటితోనూ నడవగలదు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇదే సమయంలో ఈ కారును సౌరశక్తిని ఉపయోగించి సంవత్సరంలో 3000 కి.మీ వరకు నడపవచ్చు. ప్రస్తుతం ఇది దేశంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు.
Hyundai Creta Electric
ఆటో ఎక్స్‌పో క్రెటా ఎలక్ట్రిక్ కారు ఆకర్షించింది. ఈ కారు ధర రూ. 17.99 (ఎక్స్-షోరూమ్) లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ కారులో భద్రత కోసం.. లెవల్ 2 ADAS, 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందించారు. ఇది 51.4kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 472 కి.మీ.ల పరిధిని అందిస్తుంది. 42kWh బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 390 కి.మీ.ల పరిధిని అందిస్తుంది. DC ఛార్జర్ సహాయంతో, ఈ కారు 10-80% ఛార్జ్ కావడానికి కేవలం 58 నిమిషాలు పడుతుంది.
Tata Sierra EV
టాటా మోటార్స్ ఆటో ఎక్స్‌పోలో సియెర్రా ev ని ఆవిష్కరించింది. సియెర్రా ఆ కాలంలో చాలా ప్రజాదరణ పొందిన బ్రాండ్. టాటా సియెర్రా పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో రానున్నది. భారతదేశంలో సియెర్రా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కొత్త సియెర్రాలో అనేక అధునాతన ఫీచర్లు చేర్చారు. భద్రత కోసం..ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరాలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), లెవల్ 2 ADAS వంటి ఫీచర్లు ఇందులో కనిపిస్తాయి.