గ్రూప్ 2 ఫలితాలపై టీజీపీఎస్సీ దృష్టి సారించింది. త్వరలో తుది ఫలితాలను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా… నేడు ప్రాథమిక కీలు విడుదల కానున్నాయి.
ఈ మేరకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు పేపర్ల కీలు టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
ఈ నోటిఫికేషన్లో భాగంగా 783 గ్రూప్-2 పోస్టుల నియామకాలు చేపడతారు. ఈ పోస్టుల భర్తీకి డిసెంబర్ 15, 16 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించారు. దీనికి సంబంధించిన కీలతో పాటు మాస్టర్ ప్రశ్నాపత్రాలను కూడా వెబ్సైట్లో ఉంచుతారు. https://websitenew.tspsc.gov.in/ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా వీటిని పొందవచ్చని టీజీపీఎస్సీ తన తాజా ప్రకటనలో పేర్కొంది.
గ్రూప్ 2 ప్రాథమిక కీలపై మీకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ఈరోజు నుండి టీజీపీఎస్సీకి పంపవచ్చు. జనవరి 22 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. మెయిల్ ద్వారా పంపిన అభ్యంతరాలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. వెబ్సైట్ ద్వారా నిర్ణీత ఫార్మాట్లో తగిన పత్రాలతో పంపిన వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొనబడింది.
గ్రూప్ 2 కీలను ఈ క్రింది విధంగా డౌన్లోడ్ చేసుకోండి:
- గ్రూప్ 2 రాసిన అభ్యర్థులు https://websitenew.tspsc.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
- గ్రూప్ 3 ప్రిలిమినరీ కీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత, అభ్యర్థి TGPSC ID, హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- Get Dataపై క్లిక్ చేయండి మరియు ప్రాథమిక కీలతో కూడిన మాస్టర్ ప్రశ్నాపత్రం తెరవబడుతుంది.
- నమూనా పొందడానికి ప్రింట్ లేదా డౌన్లోడ్పై క్లిక్ చేయండి.
అభ్యంతరాలను ఎలా పంపాలి..?
- గ్రూప్ 2 కీలపై అభ్యంతరాలను లేవనెత్తడానికి, https://websitenew.tspsc.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లండి.
- ప్రిలిమినరీ కీ ఆబ్జెక్షన్ లింక్‌పై క్లిక్ చేయండి.
- TGPSC ID, హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వండి.
- TGPSC సూచించిన విధంగా అభ్యంతరాలను సూచించిన ఫార్మాట్లో పంపండి మరియు సమర్పించండి.
గ్రూప్-2 పరీక్షలకు మొత్తం 5,51,855 మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, వీరిలో మొదటి పేపర్-1 పరీక్షకు 2,57,981 మంది అంటే 46.75% మంది, పేపర్-2కు 2,55,490 మంది అంటే 46.30% మంది హాజరయ్యారు. రెండో రోజు జరిగిన పేపర్-3 పరీక్షకు 2,51,738 (45.62%) మంది, పేపర్-4 పరీక్షకు 2,51,486 (45.57%) మంది హాజరయ్యారు. నాలుగు పేపర్లకు రాష్ట్రవ్యాప్తంగా 1,368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 783 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే.