విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి చిన్నోడు, పెద్దోడు గా నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. ఈ సంక్రాంతికి వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చూసిన చిన్నోడు మహేష్ బాబు, పెద్దోడు సినిమా ఎలా ఉందో సోషల్ మీడియా ద్వారా పంచుకుని, సినిమాలో నటించిన వారందరికీ అభినందనలు తెలిపారు.
“ఈ పండుగకు వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చూసి నేను చాలా ఆనందించాను, ఇది పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీ. విక్టరీ వెంకటేష్ గారు చాలా అద్భుతంగా నటించారు, వరుస బ్లాక్ బస్టర్స్ అందిస్తున్న నా దర్శకుడు అనిల్ రావిపూడిని చూసి నేను గర్వంగా, సంతోషంగా ఉన్నాను. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు.
బుడ్డోడు బుల్లిరాజు పాత్రలో అందరినీ నవ్వించారు. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ అభినందనలు” అని మహేష్ బాబు ‘సంక్రాంతి కి వస్తున్నాం’ సినిమా సమీక్షలో అన్నారు. చిన్నోడి స్పందనకు అనిల్ రావిపూడి కూడా స్పందించారు. సర్, చాలా ధన్యవాదాలు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎల్లప్పుడూ నా బలానికి మూలస్థంభంగా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు. ‘సంక్రాంతి కి వస్తున్నాం’ చిత్రానికి మీ స్పందనతో మా మొత్తం బృందం చాలా సంతోషంగా ఉంది, అనిల్ రావిపూడి అన్నారు.