ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మేనేజిరియల్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు – ఖాళీలు
1. డిప్యూటీ జనరల్ మేనేజర్: 01
2. అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 01
3. సీనియర్ మేనేజర్: 03
4. చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్: 01
5. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్: 01
Related News
మొత్తం ఖాళీల సంఖ్య: 07
అర్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో CA, డిగ్రీ, BE/BTech, MCA/MBA ఉత్తీర్ణులై ఉండాలి మరియు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు పరిమితి: 26 – 55 సంవత్సరాలకు మించకూడదు. OBCలకు మూడు సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు PWDలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ. 93,960 – రూ. 1,73,860.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తు రుసుము: రూ.750; SC/ST/PwBD అభ్యర్థులకు రూ.150.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ మొదలైన వాటి ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 30-01-2025.