Xiaomi ఫోన్ల తయారీ కంపెనీ Redmi 14C 5G స్మార్ట్‌ఫోన్ ను ఇండియాలో అందుబాటులో తెచ్చింది. ఈ ఫోన్ ను దీని నేటి నుంచే మార్కెట్లో కొనుగోలు చేయొచ్చు. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్ కావాలంటే ఈ ఫోన్ మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 4 Gen 2 సిస్టమ్-ఆన్-చిప్ తో వస్తుంది. అయితే, దీని ప్రారంభ ధర రూ.9,999గా కంపెనీ పేర్కొంది.
ఇపుడు ఈ ఫోన్ గురుంచి పూర్తిగా తెలుసుకుందాం.
Redmi 14C 5G ఫోన్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్ రూ.3,000 క్యాష్‌బ్యాక్, కూపన్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇది కాకుండా.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే, మీరు 5% తగ్గింపు పొందవచ్చు.
Related News
స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఈ ఫోన్ 600 నిట్స్ వరకు గరిష్ట ప్రకాశంతో వస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 4nm మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను కలిగి ఉంటుంది. దీనిలో మీరు 4GB/6GB LPDDR4X RAM తో పాటు 64GB/128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ ని ఉంది. మీరు మైక్రో SD తో ఫోన్ మెమరీని 1TB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 పై Xiaomi HyperOS తో నడుస్తుంది. ఇది 5G సపోర్ట్ కలిగిన డ్యూయల్ సిమ్ కార్డ్ ఫోన్.
ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే.. వెనుక భాగంలో 50MP డ్యూయల్ వెనుక కెమెరా ఉంది. సెల్ఫీల కోసం.. 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. దీనికి సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 3.5mm ఆడియో జాక్ కూడా ఉంది. దుమ్ము, స్ప్లాష్‌ల నుండి రక్షణ కోసం IP52 రేటింగ్ పొందింది. ఈ ఫోన్ 5160mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది టైప్-C తో 18W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. రెడ్‌మి 14C 5G మూడు రంగు ఎంపికలలో వస్తుంది. అది స్టార్‌గేజ్ బ్లాక్, స్టార్‌లైట్ బ్లూ, స్టార్‌డస్ట్ పర్పుల్. ఈ ఫోన్ స్టైలిష్ వెనుక ప్యానెల్ కలిగి ఉంది.