AP TG Aadhar Seva Centers : ఆధార్ సేవా కేంద్రాల్లో సూపర్ వైజర్‌, ఆపరేటర్ ఖాళీలు – నోటిఫికేషన్ వివరాలివే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆధార్ సేవా కేంద్రాల్లో (ASK) సూపర్‌వైజర్ మరియు ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

CSC ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 31, తెలంగాణలో ఫిబ్రవరి 28 చివరి తేదీ అని, వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

ఏపీలో ఎన్ని ఉద్యోగాలు…ఎక్కడ?

ఏపీలోని ఆధార్ సేవా కేంద్రాల్లో మొత్తం ఎనిమిది సూపర్‌వైజర్, ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో విశాఖపట్నం-3, కృష్ణా-1, శ్రీకాకుళం-1, తిరుపతి-1, విజయనగరం-1, వైఎస్ఆర్ కడప-1 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

తెలంగాణలో ఖాళీల వివరాలు…

తెలంగాణలో మొత్తం 16 సూపర్‌వైజర్, ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, ములుగు, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్కో పోస్టును భర్తీ చేస్తున్నారు.

ఆధార్ సేవా కేంద్రాల (ASK) సూపర్‌వైజర్ మరియు ఆపరేటర్ పోస్టులకు అభ్యర్థులు 12వ తరగతి (ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీ) పూర్తి చేసి ఉండాలి. లేదా అభ్యర్థులు 10వ తరగతితోపాటు రెండేళ్ల ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేకుంటే అభ్యర్థులు 10వ తరగతితో పాటు మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థులు ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలను కలిగి ఉండాలి. అభ్యర్థులు ఆధార్ సేవలను అందించడానికి అథారిటీ ద్వారా గుర్తింపు పొందిన సంస్థలు జారీ చేసిన ఆధార్ ఆపరేటర్ మరియు సూపర్‌వైజర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

ఆధార్ సేవా కేంద్రాల (ASK) సూపర్‌వైజర్ మరియు ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు. లేదా పైన.

ఎంపిక ప్రక్రియ – దరఖాస్తు విధానం..

ఆధార్ సూపర్‌వైజర్ మరియు ఆపరేటర్ పోస్టులకు విద్యార్హత మరియు అనుభవం ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ మరియు ఇతర పరీక్షల ద్వారా తుది ఎంపిక చేయబడుతుంది.

దరఖాస్తు ఆన్‌లైన్‌లో చేయాలి. APకి చెందిన వారు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://career.csccloud.in/apply-now/MjU0 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణకు చెందిన వారు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://career.csccloud.in/apply-now/Mjc3 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ లింక్‌లపై క్లిక్ చేసిన తర్వాత, ఆన్‌లైన్ అప్లికేషన్ వెంటనే తెరవబడుతుంది. తర్వాత అప్లికేషన్‌లోని ఫీల్డ్‌లను (పేరు, ఫోన్ నంబర్, ఇమెయిల్ ఐడి, పాన్ నంబర్, పుట్టిన తేదీ వంటి ఫీల్డ్‌లు) నింపాలి. రెజ్యూమ్ మరియు ఆధార్ సూపర్‌వైజర్ సర్టిఫికేట్‌ను అందులో అప్‌లోడ్ చేయాలి. ఏపీ అభ్యర్థులు జనవరి 31లోగా, తెలంగాణ అభ్యర్థులు ఫిబ్రవరి 28లోగా తమ దరఖాస్తులను సమర్పించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *