కొత్త సంవత్సరం కానుకగా గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించారు. గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి 19 కిలోల ఎల్పిజి కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.14.5 తగ్గింపును ప్రకటించాయి. తగ్గిన ధరలతో, జనవరి 1, 2025న సిలిండర్ ధర రూ.1804కి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీ, ముంబై తదితర మెట్రో నగరాల్లో తగ్గిన ధరలు జనవరి 1, 2025 నుంచి అమలులోకి రానున్నాయి.
2024 డిసెంబర్లో ధరలు పెంచుతామని చమురు కంపెనీలు ప్రకటించినా.. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గిన కారణంగా కంపెనీలు 2025 జనవరి 1 నుంచి భారత్‌లో గ్యాస్ ధరలను తగ్గించాయి.
ప్రతినెలా గ్యాస్ సిలిండర్ ధరల్లో సవరణ ఉంటుందని గతంలో ప్రకటించిన కంపెనీలు.. ఆగస్టు 2024 నుంచి ధరలు పెంచుతూనే ఉన్నాయి.జనవరి 2025 నుంచి ధరలు పెరగాల్సి ఉన్నా.. తగ్గడంతో ప్రస్తుతం ధరలు తగ్గుతుండటం గమనార్హం. అంతర్జాతీయ చమురు ధరలలో.
కొత్తగా మార్చబడిన 19-కిలోల LPG ధరలు:
- ఢిల్లీ రూ. 1,804
- ముంబై రూ. రూ. 1756
- చెన్నై రూ. రూ. 1966
- కోల్‌కతా రూ.- రూ. 1911