సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ 2,400 ప్రత్యేక బస్సులను నడపనుంది. జనవరి 9-13 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు లేవని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
- సంక్రాంతికి ఊరికి వెళ్తున్నారా..?
- హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారికి శుభవార్త
- ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది
సంక్రాంతి ప్రత్యేక బస్సులు
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంక్రాంతి పెద్ద పండుగ. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఎన్నో వంటకాలు, కోడి పందాలు, రంగురంగుల వాలు ఉన్నాయి. ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా చాలా మంది ఏపీ వాసులు ఉన్నారు. వారంతా సంక్రాంతి పండుగకు నగరానికి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అందుకోసం రైళ్లు, బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయిన సంగతి తెలిసిందే. బస్సులో వెళ్లాలంటే ప్రయివేటు ట్రావెల్స్ బస్సులు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీ బస్సులు నడుస్తున్నప్పటికీ అవి అంతంత మాత్రమే.
ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారికి ఏపీఎస్ ఆర్టీసీ తీపి కబురు అందించింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ప్రయాణికుల కోసం 2,400 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. జనవరి 9 నుంచి 13 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని.. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య రెగ్యులర్ సర్వీస్ బస్సులను నడుపుతున్నామని తెలిపారు. వీటికి అదనం అని చెప్పారు. మరో తీపి వార్త కూడా ఇచ్చారు.
ఈ ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ బస్సుల్లోనే చార్జీలు ఉంటాయని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని ఎంజీబీఎస్ వద్ద రద్దీని తగ్గించేందుకు జనవరి 10-12 వరకు కొన్ని మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల, అనంతపురం, చిత్తూరు వైపు వెళ్లే సాధారణ, ప్రత్యేక బస్సులను ఎంజీబీఎస్ ఎదురుగా ఉన్న పాత సీబీఎస్ గౌలిగూడ నుంచి నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు. ప్రయివేటు బస్సులను ఆశ్రయించి జేబులకు చిల్లులు పెట్టుకోకుండా సురక్షిత ప్రయాణం కోసం ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను ఆశ్రయించాలని సూచించారు.