బ్రేక్ ఫాస్ట్ లో ఇలాంటి ఆయిల్ ఫుడ్స్ తింటున్నారా? యమా డేంజర్!

చాలా మంది ఉదయం పూట రకరకాల స్నాక్స్ తింటారు. అయితే ఉదయాన్నే అల్పాహారం తీసుకునే వారు ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం మంచిది. ఇది మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

శరీర బరువు పెరగకుండా మనకు ఆరోగ్యాన్నిచ్చే ఆహార పదార్థాలనే తినాలి.

అల్పాహారంలో వీటిని తినకండి

Related News

మనం తినే బ్రేక్ ఫాస్ట్ లో ప్రొటీన్లు, విటమిన్లు, పీచుపదార్థాలు, కాల్షియం తదితర పోషకాలన్నీ ఉండేలా చూసుకోవాలి.. అయితే చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోరు. ఏది పడితే అది తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఉదయం పూట అల్పాహారంలో ఏది పడితే అది తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బయటి నుంచి తెచ్చిన అల్పాహారం తినడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.

ఉదయం అల్పాహారంలో ఆయిల్ ఫుడ్ తినడం ప్రమాదకరం

చాలా మంది అల్పాహారంలో నూనె పదార్థాలు తింటారు. అల్పాహారంగా పూరీ, వడ, బోండా వంటి నూనెతో చేసిన వాటిని తింటారు. ఉదయాన్నే ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల మన శరీరంలోని మెటబాలిజం తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది మన శరీరంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది.

బయట ఆయిల్ ఫుడ్స్ తినకండి.. 

నూనె పదార్థాలు తినేవారిలో శరీర పనితీరు మందగిస్తుంది. వారు నిదానంగా భావిస్తారు. శరీరం బరువుగా ఉండటమే కాకుండా ఏ పని చేయాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆయిల్ ఫుడ్స్ తినేవాళ్లు బయటి ఫుడ్స్ తినడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే బయట పూరీ, బోండా, వడ తయారీకి ఉపయోగించే నూనె ఒక్కసారి వాడిన తర్వాత పదే పదే వాడుతున్నారు.

అనేక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి

ఇలాంటి నూనెలతో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల గుండెపోటు, ఫ్యాటీ లివర్ సమస్యలు, మధుమేహం, క్యాన్సర్ వంటి అనేక వ్యాధులు వస్తాయి. కాబట్టి బయట ఆయిల్ ఫుడ్స్ తినడం అస్సలు మంచిది కాదు. వాటిని అల్పాహారంగా తినడం మంచిది కాదు.

 ఈ ఆహారాలతో జాగ్రత్తగా ఉండండి

పూరీ, బోండా, వడ లాంటివి అప్పుడప్పుడూ తినవచ్చు కానీ ఇంట్లోనే తాజా నూనెతో తయారు చేసుకుని తింటే మంచిది. అలాకాకుండా బయట ఇష్టారాజ్యంగా తింటే మాత్రం కచ్చితంగా ఆసుపత్రి పాలవాల్సిందే. కాబట్టి అల్పాహారం కోసం ఈ ఆహారాలతో జాగ్రత్తగా ఉండండి.

నిరాకరణ: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడింది. ఇది వన్ఇండియా ద్వారా ధృవీకరించబడలేదు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *