ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) -మెగా కాంటెస్ట్ 2025.. లక్షల్లో ప్రైజ్ మనీ.. వివరాలు ఇవే.

ఆంధ్ర ప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్(AAA)కుల-మత-వర్గ- రాజకీయాలకు అతీతంగా అమెరికాలో పని చేస్తున్న సంస్థ. తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలను…ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పడమే ఆంధ్ర ప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్(AAA) ప్రధాన ధ్యేయం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

అమెరికాలో ఉన్న ఆంధ్రులందరినీ ఒకచోట చేర్చి…మన కళలు, పండగలు, ఆహారం, కట్టుబాట్లు అందరికీ తెలిసేలా చెయ్యడమే లక్ష్యంగా… ఆంధ్ర ప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్(AAA)ను స్థాపించారు హరి మోటుపల్లి. మన విలువలను భావి తరాలకు తెలిసేలా కార్యక్రమాలను రూపొందిస్తోంది AAA. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ తొలి జాతీయ సదస్సును నిర్వహిస్తోంది. మెగా కాంటెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఈ AAA కాంటెస్ట్‌లో లక్షల రూపాయల బహుమతులు ప్రకటించారు.

Related News

AAA ఫౌండర్‌ హరి మోటుపల్లి, నేషనల్ ప్రెసిడెంట్ బాలాజీ వీర్నాల, నేషనల్ ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ హరిబాబు తుబాటి, ముగ్గుల పోటీ సమన్వయ కర్త వీరభద్ర శర్మ కూనపులి, మ్యూజిక్‌ కాంపిటీషన్‌ సమన్వయకర్త వెంకట కలిదిండి, రీల్స్‌ కాంపిటీషన్‌ సమన్వయ కర్త శ్వేత వాసగిరి, షార్ట్‌ ఫిల్మ్స్‌ కాంపిటీషన్‌ సమన్వయ కర్త వంశీ పసుపులేటి అండ్ AAA Team ఆధ్వర్యంలో…అందరి సహకారంతో ఔత్సాహిక టాలెంట్‌ పర్సన్స్‌ని ప్రోత్సహించడమే ధ్యేయంగా ఈ పోటీ జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. ఈ కాంటెస్ట్‌లో ముగ్గుల పోటీ, మ్యూజిక్‌ కాంటెస్ట్‌, షార్ట్‌ ఫిల్మ్స్‌ కాంటెస్ట్‌, షార్ట్స్‌ కాంటెస్ట్‌…జరుగుతాయి.

AAA ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రథమ మహాసభలు 2025 – మార్చ్ 28 , 29 తేదీలలో అమెరికా రాష్ట్రంలోని పెన్సిల్వేనియా లోని OAKS నగరంలో జరగబోతున్నాయి. ఈ ఉత్సవాలను ప్రపంచంలోని తెలుగువారి కోసం…అందరి సహకారంతో అంగరంగ వైభోగంగా నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్(AAA) పౌండర్‌ హరి మోటుపల్లి తెలిపారు.

మన తెలుగు సంస్కృతికి సంప్రదాయాలకు ప్రతిరూపం ముగ్గులు. అందుకే రంగవల్లుల పోటీ కూడా నిర్వహిస్తున్నారు. సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ముంగిట్లో ముగ్గులు ఉండాల్సిందే. అందకే మగువల కోసం నిర్వహిస్తోన్న ఈ పోటీలో బహుమతులు కూడా భారీగానే ఉన్నాయి. మొదటి బహుమతి అక్షరాల 25 లక్షలా…నూటాపదహార్లు. ముగ్గుల పోటీకి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం.

Muggulu Poti Prize Money:

  • 1st Prize: INR 25,00,116/- ఫస్ట్‌ ప్రైజ్‌ 25 లక్షలా నూటపదహార్లు
  • 2nd Prize: INR 15,00,116/- సెకండ్‌ ప్రైజ్‌ 15 లక్షలా నూటపదహార్లు
  • 3rd Prize: INR 10,00,116/- థర్డ్‌ ఫ్రైజ్‌ 10 లక్షలా నూటపదహార్లు
  • 4th Prize: INR 5,00,116/- ఫోర్త్‌ ప్రైజ్‌ 5 లక్షలా నూటపదహార్లు
  • 5th Prize: INR 2,00,116/- ఫిప్త్‌ ప్రైజ్‌ 2 లక్షలా నూటపదహార్లు

వీటితో పాటు ఎంపికైన టాప్‌ 100 ఎంట్రీలకు AAA సర్టిఫికెట్‌తో పాటు, ట్రోఫి, 10 వేల నూటపదహార్ల బహుమతి అందజేయబడుతుంది.


Aspiring filmmakers కోసం షార్ట్ ఫిల్మ్ పోటీ నిర్వహించబడుతుంది.

Short films Prize Money:

  • 1st Best Movie: INR 15,00,116/-15 లక్షలా నూటపదహార్లు
  • 2nd Best: INR 10,00,116/- 10 లక్షలా నూటపదహార్లు…

వీటితో పాటు 100 ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్స్‌ ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు.

సంగీత దర్శకత్వ పోటీలు కూడా ఉన్నాయి.

Music Contest Prize Money:

  • 1st Best Music: INR 7,00,116.00/- ఏడు లక్షలా నూట పదహార్లు
  • 2nd Best Music: INR 4,00,116.00/-నాలుగు లక్షలా నూట పదహార్లు
  • వీటితో పాటు 50 ఉత్తమ పాటలను ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు.

మినీ వీడియోలు సృష్టించడంలో ఆసక్తి ఉన్న వారికి రీల్స్ పోటీ కూడా ఉంది.

Reels Contest Prize Money:

  • 1st Best Reel: INR 10,00,116.00/- 10 లక్షలా నూటపదహార్లు…
  • 2nd Best Reel: INR 7,00,116.00/-ఏడు లక్షలా నూట పదహార్లు
  • 3rd Best Reel: INR 4,00,116.00/-నాలుగు లక్షలా నూట పదహార్లు
  • వీటితో పాటు 50 ఉత్తమ రీల్స్‌ను ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు.

మన తెలుగు సంస్కృతికి సంప్రదాయాలకు ప్రతిరూపం రంగవల్లులు. అలాంటి ముగ్గులు తెలుగు లోగిళ్ళలో పండగ కళ తీసుకొస్తాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ముగ్గుల పోటీని కూడా నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్(AAA). అలాగే షార్ట్ వీడియోలని తీసి రీల్స్ పోటీ లో కూడా పాల్గొని మీ ప్రతిభను చాటవచ్చు.

దీంతో పాటు దర్శకులు కావాలి అనుకునే వారు షార్ట్ ఫిల్మ్ పోటీ లో పాల్గొనాలి. మీలో ఉన్న టాలెంట్ బయట ప్రపంచానికి చాటడానికి ఈ గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి.

మీలో ఉన్న సంగీత కళాకారుడికి పని చెప్పండి. AAA సంగీత పోటీల్లో పాల్గొని మీ ప్రతిభను చాటుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ అవకాశాలు ఏమాత్రం వదులుకోవద్దు. ఆంధ్రప్రదేశ్‌ అమెరికన్‌ అసోసియేషన్‌(AAA) నిర్వహించే ఈ మెగా కాంటెస్ట్‌లో పాల్గొనండి. మీ సత్తా చాటుకుని…భారీ బహుమతులు గెలుచుకోండి.

మరిన్ని వివరాలకు theaaa.org వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *