వింటర్‌లో చలినుండి తప్పించుకోవడానికి చాలా మంది టీ తాగుతుంటారు. అయితే…టీకి బదులు ఈ డ్రింక్స్ ట్రై చెయ్యండి…ఆరోగ్యంతో పాటు బరువును కూడా కంట్రోల్‌లో ఉంచుకోండి.
గ్లాస్ వేడి నీటిలో నిమ్మరసం, తేనే కలుపుకుని తాగితే లెమన్లో ఉండే సీ విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంచి వైరల్ ఇన్‌ఫెక్షన్స్‌ను దూరం చేస్తుంది. అంతే కాదు కడుపలో ఉండే మలినాలు తొలగిపోతాయి.
గ్రీన్ టీ తాగడం వల్ల చలికాలంలో వెచ్చదనం పొందొచ్చు. గ్రీన్ టీలో ఉండే కెఫిన్, ఎంజైమ్‌లు…బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.
Related News
రాత్రి ఒక గ్లాస్ నీటిలో ఒక చెంచా సోంపు నానబెట్టి పొద్దున్నే ఆ నీటిని తాగండి. సోంపు వాటర్ వల్ల బాడీకి కావలసిన విటమిన్లు, ఖనిజాలు అందడమే కాదు…బరువు కూడా తగ్గుతారు.
షుగర్ ఉన్న వారు దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ తాగితే…షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిటెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ చెప్తాయి.