సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. నయనాలతోనే పయనాలు అంటుంది మా బామ్మ. నిజమే కదండి…మనం ఏ పని చెయ్యాలన్నా…మన కళ్ళు బాగుండాలి. కళ్ళు బాగుంటేనే…మనం బాగుంటాం…మన బతుకు బాగుంటుంది.
పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు మన కళ్ళకు రెస్ట్ అనేది ఉండదు. మరి మన కళ్ళను కాపాడుకోవడానికి…వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
అవును కళ్ళను ఆరోగ్యంగా కాపాడే ఆ ఫుడ్ ఏంటంటే…
Related News
గింజలు ఎక్కువగా తినాలి. అంటే జీడిపప్పు, బాదం, వాల్ నట్స్, పల్లీలు, ఇలా ఏ గింజలు తిన్నా ఫర్వాలేదు. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన కళ్ళను రక్షిస్తాయి. విటమిన్ ఇ వయసు ఎక్కువగా ఉండే పెద్దవారిలో వచ్చే కంటి సమస్యల నుంచి రక్షిస్తుంది.
విత్తలనాల్లో… సబ్జా, అవిసె గింజలు, చియా సీడ్స్, సన్ ఫ్లవర్ గింజలు
సిట్రస్ జాతికి చెందిన నిమ్మ, ఆరెంజ్, దానిమ్మ పండ్లు తీసుకుంటే…వీటిలో ఉండే సీ విటమిన్ కళ్ళకు రక్షణగా నిలుస్తుంది.
పచ్చగా ఉండే ఆకు కూరల్లో ఉండే లుటీన్, గ్జియాంతిన్ కంటికి ఎంతో మేలు చేస్తాయి. ఆకు కూరల్లో కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన విటమిన్ ఏ ఉంటుంది. అంతేకాదు…విటమిన్ ఏ తో పాటు సీ, కె, ఐరన్, మెగ్నిషియం, మాంగనీస్‌లు ఎంతో సమృద్ధిగా ఉంటాయ్ ఆకుకూరల్లో. వీటిని తింటే కంటికే రక్షణే కాదు…ఒంట్లో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
క్యారెట్లు కూడా కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. వీటిలో బీటా కెరోటిన్, ఏ విటమిన్ క్యారెట్లో ఎక్కువగా ఉంటాయి. అలాగే చిలగడ దుంపల్లో కూడా బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో విటమిన్ ఇ కూడా ఎక్కువే. ఫైబర్లు, మినరల్స్ చిలగడ దుంపల్లో ఎక్కువగా ఉండి…వీటిని తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
రోగ నిరోధక శక్తి... రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే…మనకు వ్యాధులు రాకుండా ఉంటాయి.
ఇంకా ఎగ్స్‌లో ఉండే లుటీన్, గ్జియాంతిన్, విటమిన్ సీ, ఇ, జింక్ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
చేపల్లో ఒమెగా 3 యాసిడ్లు బోల్డ్. ట్యూనా, సాల్మన్ చేపల్లో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రెగ్యులర్గా తీసుకుంటే…కళ్ళు డ్రై కాకుండా తేమగా ఉంటాయి. డ్రై ఐస్ చాలా డెంజర్ తెల్సా.
వీటన్నింటితో పాటు శరీరానికి అమసరమైన వాటర్ తీసుకోవడం మరిచిపోకండి…ఆరోగ్యాన్ని కాపాడుకోండి. టేక్ కేర్…