అద్భూత జీవి… సముద్రం అట్టడుగున ఉండే…ఆ జీవి కోసం…ప్రపంచ దేశాలు ఎందుకు వేటాడుతున్నాయి..? దాని రక్తంతో వ్యాపారం చేసేందుకు ఎందుకు ఉవ్విళ్ళురుతున్నాయి..? ఆ జీవి రక్తం వెల ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోకమానరు. రత్నాలకు సాటి రాగల ఆ జీవి రక్తం ఎన్నో పరిశోధనలకు ఉపయోగపడుతుంది. 450 సంవత్సరాలుగా సముద్రంలో జీవిస్తున్న ఆ ప్రాణి ఏది..? ఎందుకు ఆ జీవి రక్తానికి ఇంత డిమాండ్..?
హార్స్ షూ క్రాబ్…గుర్రపు డెక్క పీత…
హార్స్ షూ క్రాబ్ అనే జీవి పేరు చాలా మందికి తెలియదు. కానీ హార్స్ షూ క్రాబ్ బ్లడ్ చుట్టూ ఎన్నో రహస్యాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. సముద్ర గర్భంలో 450 ఏళ్ళుగా జీవిస్తోంది హర్స్ షూ క్రాబ్. దీన్ని లివింగ్ ఫాసిల్ అని కూడా పిలుస్తారు. మన దగ్గర గుర్రపు డెక్క పీతగా పిలుస్తారు. సముద్రం అట్టడుగున ఉండే ఈ జీవికి తొమ్మిది కళ్ళు ఉంటాయి. హార్స్ షూ క్రాబ్‌కు ఉండే నీలి రంగు రక్తమే దానికి ప్రత్యేకత తెచ్చింది. దీని రక్తంకు ఉండే విలువ వల్ల రత్నాలకున్న డిమాండ్ ఏర్పడింది.
హార్స్ షూ క్రాబ్ రక్తం ఒక లీటరుకు 10 నుంచి 15 లక్షల రూపాయలు పలుకుతోంది. దీంతో ప్రపంచలోని చాలా దేశాలు ఈ జీవి వేటలో పడ్డాయి. మనిషి రక్తంలో హిమోగ్లోబిన్ ఉండటం వల్ల ఎరుపుగా ఉంటుంది. హార్స్ షూ క్రాబ్ రక్తంలో హిమోగ్లోబిన్ కాకుండా హేమోసైనిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది కాపర్ ఆధారంగా పని చేస్తుంది. ఈ రక్తంలో అమేబోసైట్లు అనే కణాలు ఉంటాయి, ఇవి బ్యాక్టీరియాను తక్షణం గుర్తించగలవు. వ్యాక్సిన్ల తయారీ నుంచి పరికరాల శుభ్రతను పరీక్షించడానికి ఈ రక్తం ఉపయోగపడుతుంది. వైద్య పరికరాలను శుభ్రంగా ఉంచేందుకు హార్స్ షూ క్రాబ్ రక్తం చాలా బాగా పని చేస్తుందట.
పరిశోధనల్లో వాడకం….
హార్స్ షూ క్రాబ్ పీతల రక్తంలో చిన్న చిన్న బ్యాక్తీరియాను కూడా గుర్తించవచ్చని సైంటిస్టులు 1960లో కనుగొన్నారు. అప్పటి నుంచి హార్స్ షూ క్రాబ్ రక్తాన్ని ఫార్మా కంపెనీలు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. ప్రతి సంవత్సరం 60 లక్షలకుపైగా ఈ జీవులను పరిశోధనల్లో వాడుతున్నారు.
గతంలో… వ్యాక్సిన్ పరీక్షలకు లక్షలాది రాబ్బిట్స్‌ను ఉపయోగించేవారు. హార్స్‌షూ క్రాబ్ రక్తంతో లైసేట్ టెస్టులు ప్రారంభమైన తర్వాత… ఈ టెస్టులకు రాబ్బిట్స్‌ను బలితో తీసుకోవడం తగ్గింది. ఇది జంతు సంరక్షణకు పెద్ద మైలురాయిగా నిలిచింది.
ప్రతి ఏటా సుమారు ఆరు లక్షల హార్స్‌షూ క్రాబ్‌లను సముద్రతీర ప్రాంతాల నుంచి పరిశోధనశాలలకు తరలిస్తారు. వాటి నుంచి కొంత రక్తం సేకరించి…తిరిగి సముద్రంలో వదిలేస్తారు. అయితే ఈ ప్రక్రియలో సగం వరకు క్రాబ్స్ చనిపోతాయి. ఇది క్రాబ్స్ జాతి లభ్యతను తగ్గిస్తోంది, ఇది శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. అందుచేత కృత్రిమ బ్రీడింగ్ ప్రయోగాలు జరుగుతన్నాయి.
వ్యాపార విలువ…
మన దేశంలో ఉన్న…గోవాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓసీనోగ్రఫీ… కృత్రిమంగా హార్స్‌షూ క్రాబ్‌ల బ్రీడింగ్‌లో విజయవంతమైంది. హార్స్ షూ క్రాబ్ల నుంచి రక్తం తీసేటప్పుడు 30 శాతం చనిపోతాయట. మిగిలిన వాటిని సముద్రంలో వదులుతారు. అయితే అవి బతుకుతాయో లేదో తెలియదు. దీంతోఇది ఇలాగే కొనసాగితే…హార్స్ షూ క్రాబ్లు త్వరలో అందరించిపోయే అవకాశముందంటున్నారు సైంటిస్టులు.
దీనికి విరుగుడుగా హార్స్ షూ క్రాబ్‌లను పెంచడం ఒక పద్ధతి. హార్స్‌షూ క్రాబ్ రక్తానికి గ్లోబల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ జీవి రక్తం లీటరుకు 10 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా హార్స్‌షూ క్రాబ్ రక్తంపై ఆధారపడి ఉన్న వ్యాపారం విలువ 3 బిలియన్ డాలర్లు. హర్స్ షూ క్రాబ్ రక్తం…పకృతి సిద్ధంగా లభించే….అత్యంత ఖరీదైన ప్రాకృతిక ద్రవాల్లో ఒకటి. అమెరికా, జపాన్, చైనా వంటి దేశాల్లో దీని కోసం పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయి. అమెరికాలోని జాతీయ పారిశ్రామిక సంస్థలు హార్స్ షూ క్రాబ్ రక్తాన్ని ఉపయోగిస్తున్నాయి. చైనా కూడా బ్యాక్టీరియా పరీక్షల కోసం వాణిజ్యపరంగా ఉపయోగిస్తుంది. జపాన్ కూడా ఫార్మా పరిశోధనల్లో హార్స్ షూ క్రాబ్ రక్తాన్ని వాడుతోంది.
కృత్రిమంగా పెంచవచ్చా…
మన దేశంలోనూ హర్స్ షూ క్రాబ్ ఉపయోగించడం ద్వారా మెరుగైన ఆదాయం పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోనూ హార్స్ షూ క్రాబ్ లను పెంచి ఆర్థికంగా ముందడుగు వెయ్యవచ్చు. ఆక్వా సాగులో ఈ జీవుల పెంపకాన్ని ప్రోత్సహించి…అటు రైతులకు అదనపు ఆదాయంతో పాటు…ప్రభుత్వానికి ఆర్థిక వనరుగా మార్చుకోవచ్చు.
ఒక చిన్న పరిశ్రమను కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తే…హార్స్ షూ క్రాబ్ రక్తం ద్వారా 100 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చేలా పణాళికలు రూపొందించొచ్చు. దీని ద్వారా తీర ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
హార్స్ షూ క్రాబ్ బ్లడ్ నిజంగా ఒక అద్భుతమే అని చెప్పాలి. ఈ జీవి రక్తం ఎన్నో రంగాలపై తనదైన ప్రభావాన్ని చూపుతోంది. మన దగ్గర కూడా హర్స్ షూ క్రాబ్ జీవుల పెంపకం చేపడితే…ఆర్థికంగానే కాదు…అన్ని విధాలుగా అభివృద్ధి బాగుంటుంది.