వినోద్​ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి – ఇప్పుడెలా ఉందంటే?

Vinod Kambli Health Condition: భారత మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ (52) ఆరోగ్యం గత కొంతకాలంగా ఆందోళనకరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే శనివారం రాత్రి మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్పించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఇటీవల శివాజీ పార్క్‌లో రమాకాంత్ అచ్రేకర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కూడా కాంబ్లీ హాజరయ్యారు. డిసెంబర్ 21న జరిగిన ఈ ఈవెంట్‌లో కాంబ్లీ బాగానే ఉన్నాడు.అయితే అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం ఆయన థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సోమవారం (డిసెంబర్ 23) ఆయన ఆరోగ్యం కొంత నిలకడగా ఉన్నట్లు సమాచారం. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు సమాచారం. చికిత్సకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, 1983 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టు కాంబ్లీకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఇటీవల ప్రకటించాడు. అయితే ఆయన ఓ షరతు విధించారు. పునరావాస కేంద్రానికి వెళితే సాయం చేస్తానన్నారు. వినోద్ కాంబ్లీ అందుకు అంగీకరించాడు. కాంబ్లీ, సచిన్ టెండూల్కర్ మంచి స్నేహితులు. సచిన్ గతంలో అనారోగ్యానికి గురైనప్పుడు అతని శస్త్రచికిత్సల కోసం ఆర్థికంగా సహాయం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *