Mid Day Meal: విద్యార్థులకు గుడ్​న్యూస్​ – సంక్రాంతి తర్వాత స్పెషల్​ మెనూ

డొక్కా సీతమ్మ మధ్యాహ్న పాఠశాల భోజనం’ మెనూలో మార్పులు – ఇక నుంచి ప్రాంతాల వారీగా వంటకాలు అమలు చేయనున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

AP: సంక్రాంతి తర్వాత పాఠశాలలో పౌష్టికాహారం: మండలాల వారీగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం’ మెనూను ప్రభుత్వం మార్చింది. ప్రాంతాల వారీగా విద్యార్థుల ఆహారపు అలవాట్లు, ఆహార ప్రాధాన్యతల ఆధారంగా ఈ మెనూ రూపొందించబడింది. దీంతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా రూపొందించారు. సంక్రాంతి సెలవుల తర్వాత పాఠశాలల్లో అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. వారంలో మంగళవారం రెండు రకాల మెనూలు ఇవ్వబడ్డాయి.

విద్యార్థుల అభిరుచిని బట్టి ఒక పని జరుగుతుంది. జోన్-1లో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, జోన్-2లో తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. జోన్-3లో గుంటూరు, నెల్లూరు, ప్రకాశం ఉన్నాయి. జోన్-4లో చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు ఉన్నాయి.

 

వారం

జోన్​-1

జోన్​-2

సోమవారం అన్నం, ఆకుకూరతో పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ అన్నం, ఆకుకూరతో పప్పు, గుడ్డు ఫ్రై, చిక్కీ
మంగళవారం అన్నం, గుడ్డు కూర, పప్పు, రసం, రాగిజావ పులిహోర, చట్నీ, ఉడికించిన గుడ్డు, రాగిజావ
బుధవారం వెజ్​పలావ్​, బంగాళదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ అన్నం, కూరగాయల కూర, గుడ్డు ఫ్రై, చిక్కీ
గురువారం అన్నం, సాంబారు, గుడ్డుకూర, రాగిజావ వెజ్​రైస్​/పులావ్​, బంగాళ దుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, రాగిజావ
శుక్రవారం పులిహోర, చట్నీ (గోంగూర, కూరగాయలు), ఉడికించిన గుడ్డు, చిక్కీ అన్నం, ఆకుకూరలతో పప్పు, గుడ్డు ఫ్రై, చిక్కీ
శనివారం తెల్ల అన్నం, కూరగాయల కూర, రసం, రాగిజావ, స్వీట్​ పొంగల్​ అన్నం, కూరగాయల కూర,స్వీట్​ పొంగల్​, రాగి జావ

వారం

జోన్3

జోన్4

సోమవారం అన్నం, సాంబారు, గుడ్డుఫ్రై, చిక్కీ అన్నం, కూరగాయల కూర, ఉడికించిన గుడ్డు, చిక్కీ
మంగళవారం పులిహోర, టమాటా/ పుదీనా చట్నీ, గుడ్డు ఫ్రై, రాగి జావ పులగం/పులిహోర, పల్లీ చట్నీ, కోడిగుడ్డు ఫ్రై, రాగిజావ
బుధవారం అన్నం, 4 కూరగాయలతో కూర, గుడ్డు ఫ్రై, చిక్కీ అన్నం, సాంబారు, ఉడికించిన గుడ్డు, చిక్కీ
గురువారం వెజిటెబుల్​ రైస్​/ పలావ్​, బంగాళదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, రాగిజావ వెజిటెబుల్​ రైస్​, గుడ్డుకూర, రాగిజావ
శుక్రవారం అన్నం, గుడ్డు కూర, చిక్కీ అన్నం, ఆకు కూరతో పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ
శనివారం అన్నం, టమాటా పప్పు/ పప్పు చారు, బెల్లం పొంగలి, రాగిజావ అన్నం, కందిపప్పు చారు, బెల్లం పొంగలి, రాగిజావ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *