ఏపీలో కలకలం.. పార్శిల్‌లో శవం .. షాక్‌కు గురైన స్థానికులు

గుర్తుతెలియని మృతదేహం పార్శిల్‌లో ఇంటికి చేరిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం రేపింది. ఉండి మండలం యండగండిలో ఓ ఇంటికి పార్శిల్‌లో మృతదేహం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

మృతదేహంతో పాటు రూ.1.3 కోట్లు డిమాండ్ చేస్తూ లేఖ వచ్చిందని, చెల్లించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని కుటుంబాన్ని బెదిరించారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ నయీం అస్మీ పరిశీలించారు.

నాగ తులసి అనే మహిళ గతంలో ఇంటి నిర్మాణం కోసం క్షత్రియ సేవా సమితిని ఆర్థిక సహాయం కోరింది. లైట్లు, ఫ్యాన్లు, విద్యుత్ ఉపకరణాలు అందజేస్తామని వాట్సాప్ ద్వారా ఆమెకు సమాచారం అందించారు. గురువారం రాత్రి ఓ వ్యక్తి ఆ పార్శిల్‌ను ఆమె ఇంటికి డెలివరీ చేశాడు. అయితే, తులసి పార్శిల్‌ను తెరిచి చూడగా, ఆమెకు 45 ఏళ్ల వయస్సు గల వ్యక్తి మృతదేహం మరియు బెదిరింపు లేఖ కనిపించింది.

మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి 4-5 రోజుల క్రితమే మృతి చెందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతుడు, పార్శిల్ డెలివరీ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ అద్నాన్‌ నయీమ్‌ అస్మీ గ్రామాన్ని సందర్శించి దర్యాప్తును పర్యవేక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *