AP | వచ్చే వేసవిలోనే టీచర్ల బదిలీలు.. నిబంధనలు ఎలా అంటే..!

నేడు పాఠశాల విద్య కమిషనర్ శ్రీ వి.విజయరామరాజు గారితో జరిగిన ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో క్రింది అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో సర్వీసెస్ జెడి శ్రీ ఏ సుబ్బారెడ్డి, సర్వీసెస్ డీడీలు శ్రీమతి పి శైలజ, శ్రీ అబ్రహం పాల్గొన్నారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

సమావేశంలో ముఖ్యాంశాలు:

– జీవో నంబర్ 117 రద్దుకు సంబంధించిన ట్రాక్టర్ దాదాపు పూర్తి అయిందని, బేసిక్ ప్రాథమిక పాఠశాలలకు 1:20 నిష్పత్తిన ఉపాధ్యాయులను కేటాయిస్తామని తెలిపారు.

Related News

– ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 31 నుంచి 59 ఉన్న సందర్భంలో వాటిని మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాలలు లేని సందర్భంలో కొనసాగించేందుకు యోచన చేస్తున్నామన్నారు

ఫౌండేషన్ స్కూల్స్ అనగా ఒకటి రెండు తరగతులు ఉన్న పాఠశాలలకు 1:30 ప్రకారం ఉపాధ్యాయులను కేటాయిస్తారు.

– ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 75 దాటితే హెడ్మాస్టర్ మరియు స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టులు ఇస్తామన్నారు. మిగిలిన సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టులను కూడా మిగిలిన పాఠశాలలకు సర్దుతారు.

– ఉపాధ్యాయుల ప్రమోషన్లకు సంబంధించి టీచర్ ప్రొఫైల్ అప్డేషన్ కు వీలైనంత త్వరలో అవకాశం ఇస్తామని తెలిపారు. మొత్తం మూడుసార్లు అవకాశం ఇస్తారు. ఏవైనా తప్పులు దొర్లితే డీఈవోలు ద్వారా సరి చేస్తారు.

– ఈ వివరాల ద్వారానే ప్రమోషన్ సీనియార్టీ ను మెరిట్ కమర్ రోస్టర్ పద్ధతిలో తయారు చేస్తారని తెలిపారు.

– ఉపాధ్యాయుల బదిలీలు మరియు ప్రమోషన్లు ఎట్టి పరిస్థితుల్లో వేసవి సెలవుల్లో పూర్తి చేస్తామని తెలిపారు.

– ఉపాధ్యాయుల శాశ్వత బదిలీల కోడ్ పై సవివరంగా చర్చించడం జరిగింది.

– టీచర్ల బదిలీలకు మే 31 ప్రాతిపదికగా కనీసం రెండు సంవత్సరాలు పూర్తి అవ్వాలని,గరిష్టంగా ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన వారికి తప్పనిసరి బదిలీ ఉంటుంది. ప్రధానోపాధ్యాయులకు గరిష్టంగా ఐదు సంవత్సరాలు పూర్తవ్వాలి.

– 2017 లో బదిలీ అయిన వారు తప్పనిసరి బదిలీ క్రిందకు రారు.

సర్ ప్లస్ టీచర్లను గుర్తించేందుకు సర్వీస్ సీనియారిటీలో జూనియర్ ను గుర్తిస్తారు.

– అలా గుర్తించిన జూనియర్ కు స్పెషల్ పాయింట్లు, ప్రిఫరెన్షియల్ పాయింట్లు పాయింట్లు వస్తాయి.

– అలా కాకుండా రేషనల్లైజేషన్లో సీనియర్ విల్లింగ్ ఇచ్చినట్లయితే వారికి స్పెషల్ పాయింట్లు, పాయింట్లు రావు.

– మున్సిపల్ టీచర్ల ప్రమోషన్లు రెండు రోజుల్లో పూర్తి పూర్తిచేయాలని డిఈఓ లకు ఆదేశించామన్నారు.

– నూతనంగా పంచాయతీలు ప్రాతిపదికగా గుర్తించిన క్లస్టర్లను మరొకసారి సమీక్షిస్తారు.

  • – బదిలీలలో కేటగిరీలు గతంలో ఉన్న విధంగానే 16% హెచ్ఆర్ఏ కేటగిరి 1 గా
  • – 12 శాతం హెచ్ఆర్ఏ క్యాటగిరి 2 గా,
  • – 10 శాతం హెచ్ఆర్ఏ క్యాటగిరి 3 గా,
  • – రోడ్డు సౌకర్యం లేని పాఠశాలలో కేటగిరి 4 గా ఉంటాయి.

– స్టేషన్స్ సీనియారిటీ పాయింట్లు కూడా క్యాటగిరీ 1 కు ఒక పాయింట్ క్యాటగిరి 2 కు రెండు పాయింట్లు కేటగిరి 3 కి మూడు పాయింట్లు, కేటగిరి నాలుగు కు 5 పాయింట్లు ఉంటాయి.

– రీఅపోర్షన్ మెంట్ ద్వారా బదిలీ అయ్యే వారికి గత పాఠశాల పాయింట్లు తీసుకునేటప్పుడు 8 సంవత్సరాలకు మించకుండా పాయింట్లు కేటాయిస్తారు.

– సర్వీస్ పాయింట్లను సంవత్సరానికి ఒక్కటిగా నిర్ధారించారు.

– ఐదు స్పెషల్ పాయింట్లు ను 40 సంవత్సరాలు దాటిన అవివాహత మహిళలకు , పీహెచ్ 40 నుండి 69 శాతం వరకు ఉన్న వారికి, 13 జిల్లాల గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల బాధ్యులకు ఇస్తారు.

– స్కౌట్స్ అండ్ గైడ్స్ వారికి రెండు స్పెషల్ పాయింట్లు కేటాయిస్తారు.

– 80 శాతం VH / OH  వారికి మినహాయింపు, 70 శాతం పైన 79% వరకు ఉన్న విహెచ్/ఓహెచ్ వారికి ప్రిఫరెన్షియల్ క్యాటగిరి వర్తిస్తుంది

– ఇంకా ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, కిడ్నీ, బోన్ టీబి తదితరం వస్తాయి.

– ప్రిఫరెన్షియల్ కేటగిరి ఉపాధ్యాయుల మెడికల్ సర్టిఫికెట్లు జిల్లా మెడికల్ బోర్డు ద్వారా జనవరి నుండి ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు.
– ఇకపై సిఆర్పి ల ద్వారా సమాచారాన్ని తెప్పించుకునే ఏర్పాటు చేస్తామన్నారు..

*-సోషల్ మీడియా News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *