విజయ్ దేవరకొండ: టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ సీక్రెట్ రిలేషన్ షిప్ లో ఉన్నాడని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి.
త్వరలో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఈ డేటింగ్ రూమర్లపై స్పందించాడు.
సమయం వస్తుంది..
Related News
విజయ్ మాట్లాడుతూ.. నేను సిద్ధమయ్యాక ఆ విషయం మాట్లాడతాను. తెలియాలనుకున్నప్పుడు, నేను ఖచ్చితంగా ఆ విషయాన్ని వెల్లడిస్తాను. దానికి ఒక ప్రత్యేక సమయం, సందర్భం మరియు కారణం ఉండాలి. అలాంటి సంతోషకరమైన రోజు వస్తే నా వ్యక్తిగత జీవితాన్ని అందరితో పంచుకుంటానని క్లారిటీ ఇచ్చాడు. అలాగే విజయ్ ప్రేమ గురించి చెబుతూ.. సృష్టిలో అపరిమిత ప్రేమ ఉంటుందో లేదో తెలియదు. ఉంటే.. దానితో పాటు నొప్పి కూడా ఉంటుంది. ఎవరినైనా అతిగా ప్రేమిస్తే ఆ బాధను కూడా భరించాల్సి వస్తుంది.
రష్మికతో రిలేషన్ గురించి వార్తలు..
అయితే విజయ్, రష్మిక రిలేషన్‌షిప్‌లో ఉన్నారని తరచుగా వార్తలు వైరల్ అవుతుంటాయి. అంతేకాదు విజయ్ వెకేషన్‌కు వెళ్లి విజయ్ ఇంట్లో పండగలు జరుపుకున్న ఫొటోలను కూడా రష్మిక షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో రష్మిక మాట్లాడుతూ.. తనకు ఇష్టమైన వ్యక్తి ఎవరో అందరికీ తెలుసునని.. ఇద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నామని చెప్పకుండా చెబుతున్నట్లుగా ఉందని నెటిజన్లు అనుకుంటున్నారు.