రక్షణ దళాల్లో చేరాలనుకునే నిరుద్యోగులకు మరో శుభవార్త. ఇండియన్ ఆర్మీ తన తాజా రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. భారత రక్షణ వ్యవస్థలో కీలక భాగమైన ఇండియన్ ఆర్మీ తాజాగా టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత గల అభ్యర్థులు అధికారిక పోర్టల్‌ని సందర్శించి, సెప్టెంబర్ 12లోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ గురించి పూర్తి వివరాలను చూద్దాం.
ఖాళీల వివరాలు
Related News
ఇండియన్ ఆర్మీ తాజా నోటిఫికేషన్‌తో మొత్తం నాలుగు టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తుంది.
వయోపరిమితి: దరఖాస్తుదారుల వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
విద్యా అర్హతలు:
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్ లేదా సైబర్ సెక్యూరిటీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థలో కోర్ పెనెట్రేషన్ టెస్టింగ్/CEMech/సైబర్ సెక్యూరిటీలో కనీసం మూడు సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి. లేదా ఇండిపెండెంట్ కన్సల్టెంట్‌గా పనిచేసి ఉండాలి.
భౌతిక ప్రమాణాలు
అభ్యర్థులు టెరిటోరియల్ ఆర్మీ సూచించిన నిర్దిష్ట శారీరక మరియు వైద్య ఫిట్‌నెస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఈ ప్రమాణాలు సాధారణంగా ఎత్తు, బరువు మరియు దృష్టి వంటి అంశాలకు సంబంధించినవి.
దరఖాస్తు ప్రక్రియ
– ముందుగా ఇండియన్ ఆర్మీ అధికారిక పోర్టల్ www.jointerritorialarmy.gov.inని తెరవండి.
– హోమ్‌పేజీకి వెళ్లి, ‘ఇండియన్ ఆర్మీ టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్- 2024’ లింక్‌పై క్లిక్ చేసి, నోటిఫికేషన్ వివరాలను తనిఖీ చేయండి.
– ఆ తర్వాత టెరిటోరియల్ ఆర్మీ అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయండి.
– అన్ని వివరాలను నమోదు చేసి, దరఖాస్తును పూరించండి.
– దరఖాస్తుకు అవసరమైన పత్రాలు జతచేయాలి.
– దరఖాస్తును నిర్ణీత గడువులోగా ఆఫ్‌లైన్‌లో పోస్ట్ ద్వారా పంపాలి.
చిరునామా వివరాలు
దరఖాస్తును ‘డైరెక్టరేట్ జనరల్ టెరిటోరియల్ ఆర్మీ, ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, 4వ అంతస్తు, ఎ బ్లాక్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆఫీస్ కాంప్లెక్స్, కేజీ మార్గ్, న్యూఢిల్లీ-110001’ చిరునామాకు పోస్ట్ ద్వారా పంపాలి.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులకు ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత రాత పరీక్ష, మూడో దశ ప్రాక్టీస్ టెస్ట్, చివరగా ఇంటర్వ్యూ ఉంటుంది. వ్రాత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణత సాధించాలంటే కనీసం 60 శాతం స్కోరు సాధించాలి. ప్రాక్టీస్ టెస్ట్ కూడా 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ 300 మార్కులకు ఉంటుంది. వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థుల శారీరక, మానసిక ఆరోగ్యంపై అంచనా వేయబడుతుంది.
Salary : ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ. రూ.1,39,600 నుండి రూ.2,17,600 మధ్య లభిస్తుంది.