భారత మార్కెట్లో EVల ట్రెండ్ కొనసాగుతోంది. Electric cars, bikes లు మరియు స్కూటీలు ఇప్పటికే మార్కెట్లో విడుదలయ్యాయి మరియు వాహనదారుల నుండి గొప్ప మద్దతు లభిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఫుల్ డిమాండ్ ఉంది. ప్రయాణ ఖర్చు తక్కువగా ఉండడంతో ఈవీల విక్రయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అన్ని ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు EVల తయారీలో పాలుపంచుకున్నాయి. ఈ క్రమంలో భారత మార్కెట్లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి వచ్చింది. జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ అత్యంత చౌకైన ఈక్యూఏ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది.
Mercedes Benz cars డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీ కార్లకు క్రేజ్ ఉంది. ఇక ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లతో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. Mercedes-Benz EQA పేరుతో కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. దీని కోసం కంపెనీ బుకింగ్స్ కూడా ప్రారంభించింది. ఈ కారు డెలివరీలు 2025లో ప్రారంభమవుతాయి. మరియు ఈ ఎలక్ట్రిక్ కారు EV ప్రియులను ఆకట్టుకుంటుంది. కొత్త ‘Mercedes Benz EQA’ 250 ప్లస్ ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర రూ. 66 లక్షలు (ఎక్స్-షోరూమ్).
EQA అద్భుతమైన డిజైన్‌తో అద్భుతమైన ఫీచర్లతో నిండిపోయింది. పోలార్ వైట్, కాస్మోస్ బ్లాక్, మౌంటైన్ గ్రే, హైటెక్ సిల్వర్, స్పెక్ట్రల్ బ్లూ, పటగోనియా రెడ్ మెటాలిక్ మరియు మౌంటైన్ గ్రే మాగ్నో అనే ఏడు రంగులలో ఈ కారు అందుబాటులో ఉంది. Mercedes-Benz EQAలో త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, హెడ్స్-అప్ డిస్ప్లే, ఆగ్మెంటెడ్ రియాలిటీ నావిగేషన్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా వంటి సరికొత్త భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
Mercedes-Benz EQA 70.5 కిలోవాట్ల బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జింగ్‌తో 560 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. 8.6 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఇది గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. EQA ఎలక్ట్రిక్ కారు 100 kW DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 35 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలదని కంపెనీ తెలిపింది.