ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై AP CM Chandrababu మంత్రులు, అధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక విధానంపై సీఎం సమీక్షించారు. పాలనలో మార్పు కనిపించేలా అధికారులు వేగంగా పనిచేయాలన్నారు. 2014 నుంచి 2019 వరకు ఇసుక సరఫరాలో అమలు చేసిన విధానాలు, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను అధికారులు వివరించారు. 2016లో తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం ఫలితాలు… ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం విధానాలను మార్చుకోవడం వల్ల జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తిచూపారు.
గత ప్రభుత్వ విధానాల వల్ల ఇసుక కొరత, ధరల భారం కారణంగా నిర్మాణ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని అధికారులు వెల్లడించారు. ఇసుక క్వారీల నిర్వహణలో పారదర్శకత లోపించడం, ఇసుక క్వారీలను ప్రైవేట్ వ్యక్తులకు, ఏజెన్సీలకు అప్పగించడంతో సరఫరా, విక్రయాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.
CC cameras , GPS tracking and online system సరిగా లేకపోవడంతో అక్రమాలు జరిగాయన్నారు. ప్రయివేటు ఏజెన్సీల ద్వారా ఎంత తవ్వకాలు జరిగాయి, ఎంత విక్రయాలు జరిగాయన్న పరిశీలన, పర్యవేక్షణ లేదని అధికారులు పేర్కొంటున్నారు. నిర్మాణ రంగానికి ఇసుక అందుబాటులోకి వచ్చేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.