Mobile users టెలికాం కంపెనీలు ఊహించని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. Airtel, Reliance Jio, Vodafone Idea కంపెనీలు తమ టారిఫ్‌లను భారీగా పెంచాయి.
ఈ క్రమంలో Reliance Jio mobile tariffs లను 12-27 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన రీఛార్జ్ ప్లాన్ ధరలు జూలై 3 నుంచి అమల్లోకి రానున్నాయి.పెరిగిన రీఛార్జ్ ధరలతో Mobile Phone వినియోగదారులపై మరింత ఆర్థిక భారం పడనుంది. ఈ నేపథ్యంలో జియో తన యూజర్లకు మరో షాక్ ఇచ్చింది. రెండు పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్లను నిలిపివేసి రీఛార్జ్ ధరల పెరుగుదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వినియోగదారులకు Jio షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆ రెండు ప్లాన్స్ ఏంటి?
ప్రస్తుతం మొబైల్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చేతిలో ఫోన్ లేకుంటే నిమిషం కూడా గడవని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఫోన్ రీఛార్జ్ చేసుకోవడం తప్పనిసరి అయిపోయింది. అయితే టెలికాం కంపెనీల ఛార్జీలపై వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో, Jio వినియోగదారులు ఎక్కువగా 84 రోజుల చెల్లుబాటు ధర రూ. 395, 336 రోజుల చెల్లుబాటు ధర రూ. 1,559 ప్లాన్లు తొలగించబడ్డాయి. ఈ రెండు ప్లాన్లు కనిపించడం లేదని వినియోగదారులు X లో ఫిర్యాదు చేస్తున్నారు. రేపటి నుంచి రీఛార్జి ధరలు పెరగనుండటంతో ముందస్తుగా ప్రస్తుత ధరలతోనే రీఛార్జ్ చేసుకుంటున్నారు.
Related News
ఈ రెండు Prepaid Planలు అపరిమిత 5G డేటాతో చాలా మందిని ఆకర్షించాయి. టారిఫ్‌ను పెంచాలని జియో తీసుకున్న నిర్ణయం కారణంగా, రీఛార్జ్ చేయాలనుకునే వినియోగదారులకు ఇవి అందుబాటులో లేవు. ఈ రెండు ప్లాన్ల నుంచి ఆదాయం తక్కువగా ఉండడంతో ఈ ప్లాన్లను నిలిపివేసినట్లు టెలికాం వర్గాలు భావిస్తున్నాయి. మరియు ప్రధాన టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచడంతో, వినియోగదారులు ప్రత్యామ్నాయ నెట్‌వర్క్‌లను చూస్తున్నారు. BSNLలో తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలతో కూడిన ప్లాన్లు అందుబాటులో ఉండటంతో వినియోగదారులు ఈ నెట్వర్క్కి మారేందుకు ఆసక్తి చూపుతున్నారు.