గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం దేశాభివృద్ధికి ఎన్నో ఉన్నతమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ప్రజలకు అండగా నిలిచి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. ఎంతో మందికి ఉపాధి కల్పించి జీవనోపాధిని చూపింది. అలాగే నరేంద్ర మోదీ దేశ ప్రజల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఇక ఇప్పుడు మరోసారి బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన మోడీ సర్కార్.. దేశ ప్రజలకు శుభవార్త అందించింది. అలాగే అసెంబ్లీలో ప్రసంగించిన మోదీ పలు విషయాలను ప్రజలతో పంచుకున్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం
ఇటీవల జరిగిన ఓ సభలో నరేంద్ర మోదీ ఈ విధంగా మాట్లాడారు. “ఈరోజు చాలా మంచి రోజు.. అత్యుత్తమ మేనిఫెస్టోను రూపొందించినందుకు రాజ్‌నాథ్‌సింగ్‌ను అభినందిస్తున్నాను.. మేనిఫెస్టో కమిటీని కూడా అభినందిస్తున్నాను. గత పదేళ్లలో దేశాభివృద్ధికి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం.. ఈ పదేళ్లలో మనం కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల రూపకల్పనను చేపట్టడంతోపాటు యువత, మహిళలు, పేద వర్గాలను ప్రగతి పథంలోకి తీసుకెళ్లడమే మా లక్ష్యం. పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడమే మోదీ హామీ’’ అని నరేంద్ర మోదీ అన్నారు.
అంతే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు కొత్త సంవత్సరం ప్రారంభమైందని మోదీ అన్నారు. అంతేకాదు ఈరోజు అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని.. బీజేపీ తీర్మాన పత్రాలను విడుదల చేసింది. మేనిఫెస్టో పేపర్ల గురించి మాట్లాడుతూ.. ” దేశంలోని ప్రజలందరూ బీజేపీ మేనిఫెస్టో పేపర్‌పై చాలా ఆసక్తి చూపుతున్నారు. మా మేనిఫెస్టో ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి పెడుతుంది. భారతీయ జనతా పార్టీ మ్యానిఫెస్టో యువ భారత్ మరియు యువశక్తి, నారీ శక్తి, గరీబ్ యోజన, కిసాన్ యోజనపై యువ ఆకాంక్షల ప్రతిబింబం.