పేద సీఎం అని చెప్పుకునే జగన్ రెడ్డి ఒక్క రూపాయి జీతం తీసుకునే జగన్ రాష్ట్ర ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో కట్టిన రాజభవనాన్ని చూసి రాష్ట్ర ప్రజల మైండ్ బ్లాంక్ అవుతున్నది. వందల కోట్లు వెచ్చించి… పర్యావరణ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి నిర్మించిన ప్యాలెస్ ల వీడియోలు, ఫొటోలు బయటకు వచ్చాయి.
ఇంత సేపు చిన్న ఫోటో కూడా బయటకు రానివ్వలేదు. అయితే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు అందరినీ ప్యాలెస్ లోపలికి తీసుకెళ్లి చూపించారు. ఒకొక్కళ్ళు కళ్ళు బైర్లు కమ్మేలా లోపల దృశ్యాలు ఉన్నాయి..
ఒక్కో కమోడ్ ఖరీదు లక్షల రూపాయలు… బాత్ టబ్ ధర అంతకంటే ఎక్కువ. లక్షలోపు బాత్రూమ్ ఫిట్టింగ్ లేదు. పేదలకు కేటాయించిన సెంటు స్థలం కంటే మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ రెండింతలు ఎక్కువ. రెండు సెంట్లలో బాత్రూమ్ ఉంది. ఇందులోని విలాస వస్తువుల కోసం 100, 200 సెంట్లలో ఇళ్లు నిర్మించుకోవచ్చు. ఆ ఇంటిని చూస్తే జగన్ రెడ్డి అక్కడి నుంచే పరిపాలన చేయాలనుకున్నారని తేలిగ్గా అర్థమవుతుంది.
ఈ రుషికొండ ప్యాలెస్ వీడియోలు మరియు ఫోటోలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రజా ధనాన్ని ఇంత దారుణంగా ఖర్చు చేసే సీఎం ఉన్నాడా… తన విలాసాల కోసం ఇలా చేస్తాడా అనే చర్చ సాగుతోంది. సద్దాం హుస్సేన్ లాంటి నియంతలు కట్టిన ప్యాలెస్‌లా కనిపిస్తున్నాయి.
మొత్తం వ్యవహారం వెలుగులోకి రావడంతో వైసీపీ ఒక కవర్ డ్రైవ్ చేసింది. ఏ ప్రముఖ వ్యక్తులైనా విశాఖకు వచ్చి బస చేస్తారని కవర్ చేసింది. కానీ ప్రజలకు నిజం తెలుసు. చిన్న ఇల్లు కట్టుకుంటే డబ్బు వృథా అవుతుందని జగన్ కూడా గతంలో వ్యాఖ్యానించారు. పిచ్చి జనాలని వెర్రివాళ్లను చేయాలనుకుంటున్నారు. జగన్ రెడ్డి మరోసారి ప్రజలకు అడ్డంగా దొరికిపోయారు.