ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి Y S జగన్ మోహన్ రెడ్డి (Y S JAGANMOHAN REDDY ) కి.. రేవంత్ సర్కార్ ఊహించని ఝలక్ ఇచ్చింది.
హైదరాబాద్ లోటస్పాండ్ లో జగన్ ఇంటి ముందు అక్రమ కట్టడాలపై జీహెచ్ ఎంసీ ఉక్కుపాదం మోపింది.
జగన్ ఇంటి ముందు ఉన్న అక్రమ కట్టడాలను అధికారులు ఒక్కొక్కటిగా కూల్చివేస్తున్నారు.
గతంలో జగన్ భద్రత దృష్ట్యా రోడ్డును ఆక్రమించుకుని మరీ గదులను సిబ్బంది నిర్మించారు. రోడ్డు నిర్మాణం చేపట్టడంతో జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు రోడ్డును తొలగిస్తున్నారు.
మార్పు మొదలయ్యింది…
⚪ హైదరాబాద్
◽ హైదరాబాద్ లోటస్‍పాండ్‍లో కూల్చివేతలు
◽ జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న జీహెచ్‍ఎంసీ సిబ్బంది
◽ రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వైఎస్ ఫామిలీ
◽ ఫుట్‍పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్ట్ ల నిర్మాణం
◽ లోటస్‍పాండ్ ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదు.
◽ ఆంధ్రలో అక్రమ కట్టడాలు కూల్చివేతలు… అలాగే కూల్చివేతలు కబ్జాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సొంత కోటరీ
అసలు ఏం జరిగింది..?
రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై సామాన్యులు, వాహనదారులు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల పరంపరలో రంగంలోకి దిగిన అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. కాగా, జగన్ ఇంటి ముందు ఉన్న కట్టడాలను పోలీసుల మధ్యే అధికారులు కూల్చివేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మొత్తం మీద.. ఎక్కడ అక్రమ కట్టడాలు కనిపించినా ఉపేక్షించేది లేదని రేవంత్ సర్కార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.