ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, రామ్ చరణ్, నారా రోహిత్, సాయిధరమ్ తేజ్, యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ, దర్శకులు క్రిష్, బోయపాటి శ్రీను తదితరులు వచ్చారు.
మరోవైపు కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, నేతలు, వారి అనుNH-16 పక్కనే ఉన్న ఐటీ పార్కు ఆవరణలో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఆయనతో పాటు జూనియర్ ఎన్టీఆర్‌ని కూడా ఆహ్వానించారు. కానీ దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో రాలేకపోయాడు. అల్లు అర్జున్‌కు ఆహ్వానం అందినప్పటికీ రాలేదు.
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు :
నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, మహ్మద్ ఫరూక్, గుమ్మడి సంధ్యారాణి, పయ్యావుల కేశవ్, ఆనం రాంనారాయణ రెడ్డి, నారాయణ, వంగలపూడి అనిత, పొంగురి నారాయణ, నిమ్మల రామానాయుడు, అగనాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోల బాలవీరాంజనేయ, బి. జనవీరాంజనేయ, సి. , ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.
రేపు వీరందరికీ శాఖలు కేటాయించే అవకాసం ఉందని సమాచరం