సాధారణంగా, విద్యా సంస్థలో ప్రవేశాలు సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతాయి. పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయాల వరకు, admissions ఒక్కసారి మాత్రమే జరుగుతాయి. ఈ క్రమంలో వివిధ కారణాలతో కొందరు విద్యార్థులు admissions కోల్పోతున్నారు. ఇది ఇలా ఉంటే.. విద్యార్థులకు వెసులుబాటు కల్పిస్తూ.. ఓ వార్త బయటకు వచ్చింది. ఇక నుంచి యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు ఏడాదికి రెండుసార్లు admissions తీసుకోవటానికి అనుమతి ఇచ్చింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…
దేశంలోని విశ్వవిద్యాలయాలు మరియు ఉన్నత విద్యా సంస్థల్లో ఇప్పుడు సంవత్సరానికి రెండుసార్లు admissions తీసుకోవచ్చు. విద్యాసంస్థలు, యూనివర్సిటీలకు అనుమతులు ఇస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్ చీఫ్ జగదీశ్ కుమార్ తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి July –August లో మొదట, January – February లో రెండు అడ్మిషన్లు ఉంటాయి.
ఈ సందర్భంగా పీటీఐతో మాట్లాడుతూ.. భారతీయ యూనివర్సిటీలు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు ఇస్తే బోర్డు ఫలితాల జాప్యం, ఆరోగ్యం, వ్యక్తిగత సమస్యలతో July –August సెషన్లో అడ్మిషన్లు తీసుకోలేని విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. యూనివర్సిటీల్లో విద్యార్థులు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లతో ఒక్కసారి సీటు రాకపోతే ఏడాది పాటు ఎదురుచూడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రస్తుత అడ్మిషన్ విధానం ప్రకారం ఒక్కసారి అడ్మిషన్ రాకపోతే ఏడాది పొడవునా వేచి ఉండాల్సిందేనని అన్నారు. తాజా నిర్ణయంతో విద్యార్థులకు కూడా త్వరగా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.
సంవత్సరానికి రెండుసార్లు అడ్మిషన్ల విధానంతో, విశ్వవిద్యాలయాలు మరియు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రొఫెసర్లు, లెక్చరర్లు, ల్యాబ్‌లు, తరగతులు మరియు ఇతర సహాయక సేవలు వంటి వనరుల పంపిణీ మరింత సమర్థవంతంగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే యూనివర్సిటీలు ఏటా రెండు అడ్మిషన్ల విధానాన్ని అనుసరిస్తున్నాయని జగదీష్ తెలిపారు. భారత్‌లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. అయితే universities రెండు సార్లు అడ్మిషన్ల విధానాన్ని అనుసరించడం తప్పనిసరి కాదని జగదీష్ తెలిపారు.