Unknown Facts about Ramoji Film City : రామోజీ గ్రూప్ అధినేత రామోజీ రావు 1996లో స్థాపించిన ఈ ఫిల్మ్ సిటీని పర్యాటక ప్రాంతంగా కూడా పిలుస్తారు. రామోజీ ఫిల్మ్ సిటీ 2000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీ.
హైదరాబాద్ కు 25 కి.మీ దూరంలో ఉన్న ఈ ఫిల్మ్ సిటీలో తెలుగు సినిమాలే కాకుండా అనేక విదేశీ భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియల్స్ నిర్మించబడ్డాయి, నిర్మిస్తున్నారు.
ఇందులో వివిధ దేశాలకు చెందిన తోటల నమూనాలు, వివిధ జాతీయ మరియు విదేశీ శిల్పాలు మరియు చలనచిత్ర దృశ్యాల కోసం వివిధ స్టాండర్డ్ సెట్లు ఉన్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న ఈ ఫిలింసిటీలో తెలుగు చిత్రాలే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల షూటింగ్‌లు జరుగుతాయంటే అతిశయోక్తి కాదు.
సినిమా షూటింగ్ లొకేషన్స్, సెట్టింగ్స్, టెక్నికల్ ఎక్విప్ మెంట్స్, సదుపాయాలు ఒకే చోట ఉండేలా ఫిలింసిటీ గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి.
ఇక్కడికి రాని భారతీయ సినీ ప్రముఖులు లేరంటే అతిశయోక్తి కాదు. ఫిల్మ్ సిటీకి ప్రతి సంవత్సరం సగటున 13 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు.
ఉర్దూ నుండి కన్నడ వరకు, గుజరాతీ నుండి బంగ్లా వరకు, తెలుగు గడ్డపై అనేక ప్రాంతీయ భాషలలో టెలివిజన్ ఛానెల్‌లను ప్రారంభించడం రామోజీ రావుకు మాత్రమే కాకుండా హైదరాబాద్‌కు కూడా ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది.
ఫిల్మ్ సిటీతో పాటు ఉషాకిరణ్ మూవీస్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను కూడా రామోజీరావు స్థాపించారు.
ఫిలిం సిటీలో దాదాపు 2500కు పైగా సినిమాలు చిత్రీకరించినట్లు అంచనా.
ఇక్కడ చిత్రీకరించిన కొన్ని బ్లాక్బస్టర్లలో చెన్నై ఎక్స్‌ప్రెస్, క్రిష్, బాహుబలి మరియు డర్టీ పిక్చర్ ఉన్నాయి.